చిత్రం: పాతాళ భైరవి (1958)
రచన: పింగళి నాగేంద్రరావు
గానం: ఘంటసాల,పి. లీల
సంగీతం: ఘంటసాల
ప్రణయజీవులకు దేవివరాలే
కానుకలివియే ప్రియురాలా హాయిగా మనకింక స్వేచ్ఛగా హాయిగా మనకింక స్వేచ్ఛగా హాయిగా చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా చెలిమినించు పాటలా విలాసమైన ఆటలా కలసిమెలసి పోదమో వలపుబాటన హాయిగా మనకింక స్వేచ్ఛగా హాయిగా నీ వలపు నా వలపు పూలమాలగా నీ వలపు నా వలపు పూలమాలగా నీవు నేను విడివడని ప్రేమమాలగా హాయిగా మనకింక స్వేచ్ఛగా హాయిగా కలలు నిజముకాగా కలకాలమొకటిగా కలలు నిజముకాగా కలకాలమొకటిగా తెలియరాని సుఖములలో తేలిపోవగా హాయిగా మనకింక స్వేచ్ఛగా హాయిగా మనకింక స్వేచ్ఛగా హాయిగా స్వేచ్ఛగా హాయిగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి