8, ఫిబ్రవరి 2022, మంగళవారం

Maya Bazar : Chupulu Kalasina Subhavela Song Lyrics (చూపులు కలసిన శుభవేళా)

చిత్రం: మాయా బజార్ (1955)

సాహిత్యం: పింగళి

గానం: ఘంటసాల

సంగీతం: ఘంటసాల



పల్లవి:: చూపులు కలసిన శుభవేళా..ఆ ఎందుకు నీకీ కలవరము..ఎందుకు నీకీ కలవరము ఉల్లాసముగా నేనూహించిన..అందమె నీలో చిందెనులే చూపులు కలసిన శుభవేళా..ఎందుకు నీకీ కలవరము చూపులు కలసిన శుభవేళా..ఆ ఎందుకు నీకీ పరవశము..ఎందుకు నీకీ పరవశము ఏకాంతములో ఆనందించిన..నా కలలే నిజమాయెనులే చూపులు కలసిన శుభవేళ..ఎందుకు నీకీ పరవశము చరణం::1 ఆలాపనలు సల్లాపములు..కలకల కోకిల గీతములే..ఏ..ఏ..ఏ ఆలాపనలు సల్లాపములు..కలకల కోకిల గీతములే..ఏఏఏఏఏఏ చెలువములన్ని..చిత్ర రచనలే..ఏ చెలువములన్ని..చిత్ర రచనలే..ఏఏఏఏ చలనములోహో..నాట్యములే చూపులు కలసిన శుభవేళ..ఎందుకు నీకీ కలవరము చరణం::2 శరముల వలనే చతురోక్తులను..చురుకుగా విసిరే నైజములే..ఏ..ఏ..ఏ శరముల వలనే చతురోక్తులను..చురుకుగ విసిరే నైజములే ఉద్యానమున వీర విహారమే..ఏ..ఏ  ఉద్యానమున..వీర విహారమే..తెలిపెదనో హో శౌర్యములే చూపులు కలసిన శుభవేళా..ఎందుకు నీకీ పరవశము ఎందుకు నీకీ కలవరము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి