చిత్రం: మాయా బజార్ (1955)
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, పి. సుశీల
సంగీతం: ఘంటసాల
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ..ఆ..ఆ..ఆ తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ..ఆ..ఆ..ఆ అలల ఊపులో తియ్యని తలపులూ... చెలరేగే ఈ కలయికలో మిలమిలలో అలల ఊపులో తియ్యని తలపులూ... చెలరేగే ఈ కలయికలో మిలమిలలో మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ..ఆ..ఆ..ఆ