చిత్రం : మాయదారి మల్లిగాడు (1973)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : పి. సుశీల
పల్లవి: మల్లె పందిరి నీడలోన జాబిల్లి.. మంచమేసి ఉంచినాను జాబిల్లి మల్లె పందిరి నీడలోన జాబిల్లి.. మంచమేసి ఉంచినాను జాబిల్లి మా అన్నకు.. మా చంద్రికి.. ఇది తొలి రేయి.. నాకిది వరమోయి..ఈ.. కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి.. తెల్లవారనీయకోయి ఈ రేయి.. చరణం 1: గడుసు పిల్లకు వయసు నేడే.. గురుతుకొచ్చిందీ..ఈ.. మొరటువాని మనసు దానికి పులకరించిందీ..ఈ.. గడుసుపిల్లకు వయసు నేడే గురుతుకొచ్చిందీ..ఈ.. మొరటువాని మనసు దానికి పులకరించిందీ..ఈ.. ఇద్దరికీ ఈనాడు నువ్వే ముద్దు నేర్పాలి ఆ ముద్దు చూసి చుక్కలే నిను వెక్కిరించాలి కళ్ళు కుట్టి వెళ్ళకోయి జాబిల్లి.. తెల్లవార నీయకోయి ఈ రేయి.. చరణం 2: పెళ్ళి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ..ఈ.. పసుపుతాడే నోచుకోని బ్రతుకు నాదీ..ఈ.. పెళ్లి సంబరమెన్నడెరుగని ఇల్లు నాదీ..ఈ.. పసుపు తాడే నోచుకోని బ్రతుకు నాదీ..ఈ.. ఈ పెళ్ళి చూసి నేను కూడా ముత్తైదువైనాను ఈ పుణ్ణెమే పై జన్మలో నను ఇల్లాలిని చేయాలి మల్లె పందిరి నీడలోన జాబిల్లి.. మంచమేసి ఉంచినాను జాబిల్లి మా అన్నకు.. మా చంద్రికి.. ఇది తొలి రేయి.. నాకిది వరమోయి..ఈ.. కళ్ళుకుట్టి వెళ్ళకోయి జాబిల్లి.. తెల్లవారనీయకోయి ఈ రేయి.. ఊహూ.. ఊహూ.. ఊహూ.. ఊహూ.. ఊహూ.. ఊహూ.. ఊహూ.. ఊహూ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి