చిత్రం: పండంటి కాపురం (1972)
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో… మూడు రోజులు
బంధాలేమో పదివేలు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో… మూడు రోజులు
బంధాలేమో పదివేలు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
నదిలో నావ… ఈ బ్రతుకు, ఊఉ ఆ ఆఆ
నదిలో నావ… ఈ బ్రతుకు
దైవం నడుపును… తన బతుకు
అనుబంధాలు ఆనందాలు… తప్పవులేరా కడవరకు
తప్పవులేరా కడవరకు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో… మూడు రోజులు
బంధాలేమో పదివేలు
రాగం ద్వేషం రంగులురా
రాగం ద్వేషం రంగులురా
భోగం భాగ్యం తళుకేరా
కునికే దీపం తొణికే ప్రాణం
నిలిచేకాలం తెలియదురా
నిలిచేకాలం తెలియదురా
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో… మూడు రోజులు
బంధాలేమో పదివేలు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి