చిత్రం: మువ్వ గోపాలుడు (1987)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డిముత్యాల చెమ్మచెక్కలు ముగ్గులు వేయంగా రతనాల చెమ్మచెక్కలు రంగులు వేయంగా చేమంతికి సీమంతం గోరింకకు పేరంటం సిరిమల్లికి సింధూరం చిగురుమాను గుబురుళ్ళు చిలకపాప కబురుళ్ళు పైరుపైరునా పైరగాలి పరవళ్లు కోకిల గొంతున కుహుకుహు రాగం మబ్బుల మాటున ధిమిధిమి నాదం ఆకాశం అంచు మీద ఆరేసిన మబ్బు చీర అందుకుంటే ఆటవిడుపు పదవే పదపదపదపద పదపదపదపద ముత్యాల చెమ్మచెక్కలు ముగ్గులు వేయంగా రతనాల చెమ్మచెక్కలు రంగులు వేయంగా కొండపల్లి కొయ్యబొమ్మ కోకకట్టి కూర్చుందమ్మ అంతలోనే అయ్యయ్యయ్యో పమపమపమపమ సరి ఈడు అమ్మళ్ళు సరదాల గుమ్మళ్ళు ఆటలాడితే అల్లోఅల్లో నేరేళ్ళు కురిసే సిగ్గుల మరదలు పిల్ల మెరిసే బుగ్గల సొగసరి పిల్ల నిన్నేమో చిన్ని మొలక నేడేమో వన్నె చిలక నేటితోనే ఆట కట్టు అవునా? సరిసరిసరిసరిసరిసరిసరిసరి
రతనాల చెమ్మచెక్కలు రంగులు వేయంగా కొండపల్లి కొయ్యబొమ్మ కోకకట్టి కూర్చుందమ్మ అంతలోనే అయ్యయ్యయ్యో పమపమపమపమ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి