చిత్రం: నీరాజనం (1989)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డినిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటిని ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శ్రుతి వింటిని నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను నీ జతగూడి నడయాడగా జగమూగింది సెలయేరుగా ఒక క్షణమైన నినువీడినా మది తొణికింది కన్నీరుగా మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి