చిత్రం: నీరాజనం (1989)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
సంగీతం: ఓ.పి. నయ్యర్
గానం: ఎస్.జానకి
నేనే సాక్ష్యము ఈ ప్రేమయాత్ర కేది అంతము
నేనే సాక్ష్యము ఈ ప్రేమయాత్ర కేది అంతము
ఈ ప్రేమయాత్ర కేది అంతము
హద్దులో అదుపులో ఆగని గంగలా
నీటిలో నిప్పులో నింగిలో నిలవని గాలిలా
విశ్వమంతా ఉన్న ప్రేమకు
ప్రేమ లోన బతుకున్న ఆత్మకు
విశ్వమంతా ఉన్న ప్రేమకు
ప్రేమ లోన బతుకున్న ఆత్మకు
నేనే సాక్ష్యము ఈ ప్రేమయాత్ర కేది అంతము
వెలగని దివ్వెని పలకని మువ్వనై
తీయని మమతకై తీరనీ కోరికై
వేచి వేచి పాడుతున్న పాటకు
పాటలోని జరుగుతున్నా జన్మకు
వేచి వేచి పాడుతున్న పాటకు
పాటలోని జరుగుతున్నా జన్మకు
నేనే సాక్ష్యము ఈ ప్రేమయాత్ర కేది అంతము
నేనే సాక్ష్యము ఈ ప్రేమయాత్ర కేది అంతము
ఈ ప్రేమయాత్ర కేది అంతము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి