Neerajanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Neerajanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Neerajanam : Ee Vishala Prashantha ekantha soudhamlo Song Lyrics (ఈ విశాల ప్రశాంత)

చిత్రం: నీరాజనం (1989)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

సంగీతం: ఓ.పి. నయ్యర్

గానం: ఎం.ఎస్.రామారావు




ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో... నిదురించు జహాపనా ...నిదురించు జహాపనా... ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా . నిదురించు జహాపనా... పండువెన్నెల్లో వెండి కొండల్లే తాజ్ మాహల్ ధవళకాంతుల్లో పండువెన్నెల్లో వెండి కొండల్లే తాజ్ మహల్ ధవళకాంతుల్లో నిదురించు జహాపనా. నిదురించు జహాపనా... ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా ... నిదురించు జహపనా. నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి నీ జీవిత జ్యోతి నీ మధురమూర్తి ముంతాజ్ సతి సమాధి సమీపాన నిదురించు ముంతాజ్ సతి సమాధి సమీపాన నిదురించు జహాపనా... ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా . నిదురించు జహాపనా

Neerajanam - Nene Sakshyamu Song Lyrics ( నీవే సాక్ష్యము )

చిత్రం: నీరాజనం (1989)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

సంగీతం: ఓ.పి. నయ్యర్

గానం: ఎస్.జానకి 



నేనే సాక్ష్యము ఈ ప్రేమయాత్ర కేది అంతము

నేనే సాక్ష్యము ఈ ప్రేమయాత్ర కేది అంతము

ఈ ప్రేమయాత్ర కేది అంతము


హద్దులో అదుపులో ఆగని గంగలా

నీటిలో నిప్పులో నింగిలో నిలవని గాలిలా 

విశ్వమంతా ఉన్న ప్రేమకు

ప్రేమ లోన బతుకున్న ఆత్మకు

విశ్వమంతా ఉన్న ప్రేమకు

ప్రేమ లోన బతుకున్న ఆత్మకు


నేనే సాక్ష్యము ఈ ప్రేమయాత్ర కేది అంతము


వెలగని దివ్వెని పలకని మువ్వనై

తీయని మమతకై  తీరనీ కోరికై

వేచి వేచి పాడుతున్న పాటకు 

పాటలోని జరుగుతున్నా జన్మకు

వేచి వేచి పాడుతున్న పాటకు 

పాటలోని జరుగుతున్నా జన్మకు


నేనే సాక్ష్యము ఈ ప్రేమయాత్ర కేది అంతము

నేనే సాక్ష్యము ఈ ప్రేమయాత్ర కేది అంతము

ఈ ప్రేమయాత్ర కేది అంతము

Neerajanam : Ghallu Ghalluna Song Lyrics (ఘల్లు ఘల్లున )

చిత్రం: నీరాజనం (1989)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

సంగీతం: ఓ.పి. నయ్యర్

గానం: ఎస్.జానకి




ఘల్లు ఘల్లున గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్ళి పడ్డది మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది ఘల్లు ఘల్లున గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్ళి పడ్డది మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది

క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో.. అనురాగమే తలవూపెను నీలాకాశ తీరాలలో.. క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో.. అనురాగమే తలవూపెను నీలాకాశ తీరాలలో..


ఘల్లు ఘల్లున గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్ళి పడ్డది మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది ఘల్లు ఘల్లున గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్ళి పడ్డది మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది

కలగీతమై పులకించెను నవకళ్యాన నాద స్వరం కథ కానిది తుది లేనిది మన హృదయాల నీరాజనం కలగీతమై పులకించెను నవకళ్యాన నాద స్వరం కథ కానిది తుది లేనిది మన హృదయాల నీరాజనం

ఘల్లు ఘల్లున గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్ళి పడ్డది మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది ఘల్లు ఘల్లున గుండె ఝల్లన పిల్ల ఈడు తుళ్ళి పడ్డది మనసు తీరగా మాటలాడక మౌనం ఎందుకన్నది

లా లా లా లా లా లా

Neerajanam : Prema Velasindi Song Lyrics (ప్రేమ వెలసింది.)

చిత్రం: నీరాజనం (1989)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

సంగీతం: ఓ.పి. నయ్యర్

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి


ప్రేమ వెలసింది..ప్రేమ వెలసింది మనసులోనే మౌన దేవతలా ప్రేమ కురిసింది కనుల ముందే నిండు దీవెనలా..ప్రేమ వెలసింది..

ప్రేమ లేకుంటే ఉదయమైనా చీకటేనంట ప్రేమ లేకుంటే ఉదయమైనా చీకటేనంట ప్రేమ తోడుంటే మరణమైన జననమేనంట ప్రేమ తోడుంటే మరణమైన జననమేనంట

ప్రేమ వెలసింది..ప్రేమ వెలసింది మనసులోనే మౌన దేవతలా ప్రేమ కురిసింది కనుల ముందే నిండు దీవెనలా.. ప్రేమ వెలసింది..

కడలి ఎద పైన పడవలాగ కదిలె ఆ ప్రేమ కడలి ఎద పైన పడవలాగ కదిలె ఆ ప్రేమ నేల ఒడి దాటి నింగి మీటి నిలిచే ఆ ప్రేమ నేల ఒడి దాటి నింగి మీటి నిలిచే ఆ ప్రేమ

ప్రేమ వెలసింది..ప్రేమ వెలసింది మనసులోనే మౌన దేవతలా ప్రేమ కురిసింది కనుల ముందే నిండు దీవెనలా.. ప్రేమ వెలసింది..

Neerajanam : Manasoka Madhukalasam Song Lyrics (మనసొక మధు కలశం)

చిత్రం: నీరాజనం (1989)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

సంగీతం: ఓ.పి. నయ్యర్

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం


మనసొక మధు కలశం - పగిలే వరకే అది నిత్య సుందరం మనసొక మధు కలశం - పగిలే వరకే అది నిత్య సుందరం మనసొక మధు కలశం ఒహోహో ఆహాహా ఆహాహా ఒహోహో .... మరిచిన మమతోకటీ మరి మరి పిలిచినదీ మరిచిన మమతోకటీ మరి మరి పిలిచినదీ ఒక తీయని.... పరి తాపమై ఒక తీయని.... పరి తాపమై మనసొక మధు కలశం - పగిలే వరకే అది నిత్య సుందరం మనసొక మధు కలశం - పగిలే వరకే అది నిత్య సుందరం మనసొక మధు కలశం ఓహోహో ఆహాహా ఆహాహా ఓహొహో తొలకరి వలపొకటీ - తలపుల తోలిచినదీ  తొలకరి వలపొకటీ - తలపుల తోలిచినదీ గత జన్మల అనుబంధమై గత జన్మల అనుబంధమై మనసొక మధు కలశం - పగిలే వరకే అది నిత్య సుందరం మనసొక మధు కలశం - పగిలే వరకే అది నిత్య సుందరం మనసొక మధు కలశం

Neerajanam : Na Premake Selavu Song Lyrics (నా ప్రేమకే సెలవు )

చిత్రం: నీరాజనం (1989)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

సంగీతం: ఓ.పి. నయ్యర్

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



నా ప్రేమకే సెలవు నా దారికే సెలవు కాలానికే సెలవు దైవానికే సెలవు ఈ సూన్యం నా గమ్యం ఈ జన్మకే సెలవు నా ప్రేమకే సెలవు నా దారికే సెలవు కాలానికే సెలవు దైవానికే సెలవు మదిలోని రూపం మొదలంట చెరిపి మనసార ఎడ్చనులే కనరాని గాయం కసితీర కుదిపి కడుపార నవ్వానులే నా ప్రేమకే సెలవు నా దారికే సెలవు కాలానికే సెలవు దైవానికే సెలవు అనుకున్న దీవు అది ఎండమావు ఆ నీరు జలతారులే నా నీడ తానే నను వీడగానె మిగిలింది కన్నీరులే నా ప్రేమకే సెలవు నా దారికే సెలవు కాలానికే సెలవు దైవానికే సెలవు ఈ సూన్యం నా గమ్యం ఈ జన్మకే సెలవు నా ప్రేమకే సెలవు నా దారికే సెలవు కాలానికే సెలవు దైవానికే సెలవు

Neerajanam : Mamathe Madhuram Song Lyrics (మమతే మధురం)

చిత్రం: నీరాజనం (1989)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

సంగీతం: ఓ.పి. నయ్యర్

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



మమతే మధురం మమతే మధురం మరపే శిశిరం ఎదకు విధికి జరిగే సమరం జరిగే సమరం.. మమతే మధురం మమతే మధురం మరపే శిశిరం ఎదకు విధికి జరిగే సమరం జరిగే సమరం..జరిగే సమరం..

మనిషికి వలపే వరమా మది వలపుకు వగపే ఫలమా మనిషికి వలపే వరమా మది వలపుకు వగపే ఫలమా అది పాపమా..విధి శాపమా అది పాపమా..విధి శాపమా ఎద ఉంటే అది నేరమా..

మమతే మధురం మమతే మధురం మరపే శిశిరం ఎదకు విధికి జరిగే సమరం జరిగే సమరం..జరిగే సమరం..

గుండెల దాటని మాట ఎద పిండిన తియ్యని పాట గుండెల దాటని మాట ఎద పిండిన తియ్యని పాట చరణాలుగా తరుణించునా చరణాలుగా తరుణించునా పల్లవిగా మరపించునా...

మమతే మధురం మమతే మధురం మరపే శిశిరం ఎదకు విధికి జరిగే సమరం జరిగే సమరం..జరిగే సమరం.. మమతే మధురం మమతే మధురం

Neerajanam : Oohala Uyyalalo Song Lyrics (ఊహల ఊయలలో)

చిత్రం: నీరాజనం (1989)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

సంగీతం: ఓ.పి. నయ్యర్

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవి పాడినవి వలపుల సరిగమలు ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవి పాడినవి వలపుల సరిగమలు ఊహల ఊయలలో

ఆహ..ఆహ..ఓహోహో..ఆహ ఆహ..ఆహ..ఓహోహో..ఆహ చిటపట చినుకులలో తొలకరి వణుకులలో చిటపట చినుకులలో తొలకరి వణుకులలో చలించినది ఫలించినది చెలీ తొలి సోయగము ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవి పాడినవి వలపుల సరిగమలు ఊహల ఊయలలో

ఓహో..ఆహ..లాలలా..ఆహ హూ..ఆహ..ఒహోహో..ఆహ.. ముసిరిన మురిపములో కొసరిన పరువములో ముసిరిన మురిపములో కొసరిన పరువములో తపించినది తరించినది ప్రియా తొలి ప్రాయమిది

ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవి పాడినవి వలపుల సరిగమలు ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవి పాడినవి వలపుల సరిగమలు

Neerajanam : Nee Vadanam Song Lyrics (నీ వదనం విరిసే కమలం)

చిత్రం: నీరాజనం (1989)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

సంగీతం: ఓ.పి. నయ్యర్

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం

నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం

నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం

నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం

పాదం నీవై పయనం నేనై ప్రసరించె రసలోకతీరం

ప్రాణం మెరిసి ప్రణయం కురిసి ప్రభవించె గంధర్వగానం పాదం నీవై పయనం నేనై ప్రసరించె రసలోకతీరం -

ప్రాణం మెరిసి ప్రణయం కురిసి ప్రభవించె గంధర్వగానం

నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం

నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం

నాదాలెన్నో రూపాలెన్నో ననుచెరే లావణ్యనదులై - భువనాలన్నీ గగనాలన్నీ రవళించె నవరాగనిధులై నాదాలెన్నో రూపాలెన్నో ననుచెరే లావణ్యనదులై - భువనాలన్నీ గగనాలన్నీ రవళించె నవరాగనిధులై

నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం

నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం

Neerajanam : Ninu Choodaka Nenunndalenu Song Lyrics (నిను చూడక నేనుండలేను)

చిత్రం: నీరాజనం (1989)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

సంగీతం: ఓ.పి.నయ్యర్

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటిని ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శ్రుతి వింటిని నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను నీ జతగూడి నడయాడగా జగమూగింది సెలయేరుగా ఒక క్షణమైన నినువీడినా మది తొణికింది కన్నీరుగా మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను