చిత్రం: నీరాజనం (1989)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
సంగీతం: ఓ.పి. నయ్యర్
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
ప్రేమ వెలసింది..ప్రేమ వెలసింది మనసులోనే మౌన దేవతలా ప్రేమ కురిసింది కనుల ముందే నిండు దీవెనలా..ప్రేమ వెలసింది..
ప్రేమ లేకుంటే ఉదయమైనా చీకటేనంట ప్రేమ లేకుంటే ఉదయమైనా చీకటేనంట ప్రేమ తోడుంటే మరణమైన జననమేనంట ప్రేమ తోడుంటే మరణమైన జననమేనంట
ప్రేమ వెలసింది..ప్రేమ వెలసింది మనసులోనే మౌన దేవతలా ప్రేమ కురిసింది కనుల ముందే నిండు దీవెనలా.. ప్రేమ వెలసింది..
కడలి ఎద పైన పడవలాగ కదిలె ఆ ప్రేమ కడలి ఎద పైన పడవలాగ కదిలె ఆ ప్రేమ నేల ఒడి దాటి నింగి మీటి నిలిచే ఆ ప్రేమ నేల ఒడి దాటి నింగి మీటి నిలిచే ఆ ప్రేమ
ప్రేమ వెలసింది..ప్రేమ వెలసింది మనసులోనే మౌన దేవతలా ప్రేమ కురిసింది కనుల ముందే నిండు దీవెనలా.. ప్రేమ వెలసింది..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి