చిత్రం : పంతులమ్మ (1978)
గీత రచయిత : వేటూరి సుందరరామమూర్తి గారు సంగీతం : రాజన్–నాగేంద్రగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
ఆ...ఆ...ఆ...ఆఆఆ.. ఆ.. ఆఆఆ ఆ ఆ ఆ మానస వీ..ణా మధు గీతం.. మన సంసారం సంగీతం సాగర మధనం, అమృత మధురం, సంగమ, సరిగమ, స్వర పారిజాతం మానస వీ..ణా మధు గీతం.. మన సంసారం సంగీతం సంసారం.. సంగీతం.. ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన హృదయ పరాగం ఆ....ఆ..ఆ...ఆ..ఆ.... ఆ....ఆ..ఆ...ఆ..ఆ.... ఆ....ఆ..ఆ...ఆ..ఆ.... ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన హృదయ పరాగం ఎద లోయలలో.. నిదురించిన నా.. కోరిక పాడే.. కోయిల గీతం.. శత వసంతాల, దశ దిశాంతల, సుమ సుగంధాల, భ్రమర నాదాల కుసుమించు నీ అందమే, విరిసింది అరవిందమై, కురిసింది మకరందమే మానస వీ..ణా మధు గీతం.. మన సంసారం సంగీతం సంసారం.. సంగీతం. జాబిలికన్నా, నా చెలీ మిన్నా.. పులకింతలకే.. పూచిన పొన్నా... కానుకలే..వీ.. నేనివ్వగలనూ.. కన్నుల కా...టుక నేనవ్వగలనూ.. పాల కడలిలా వెన్నెల పొంగింది, పూల పడవలా.. నా తనువూగింది ఏ మల్లెల తీరాల నిను చేరగలనూ మనసున మమతై కడ తేరగలనూ ఆ........ పదసరిగపదప మామ్మ గాగ్గ రీర్రి గాగ్గ సరిసదామా.. రిమ దప మరి మరి సరీర్రి దసాస్స పదాద్ద పదాద్ద ప.. మానస వీ..ణా మధు గీతం.. మన సంసారం సంగీతం సంసారం.. సంగీతం.. ఆ...ఆ..ఆ..ఆ... నిరిగమదా.. మగరినీ.. దనిరీ.. నిదమా...ఆ..ఆ..ఆ..ఆ.. ఆ...ఆ..ఆ..నీన్ని రీర్రి గాగ్గ మామ్మ దాద్దా.. దాద్ద నీన్ని రీర్రి గాగ్గ మామ్మా మామ్మ దాద్ద నీన్ని రీర్రి గగ్గా గా.. కురిసే దాకా అనుకోలేదూ శ్రావణ మేఘమనీ.. ఆ..ఆ..తడిసే దాకా అనుకోలేదూ తీరనీ దాహమనీ.. ఆ..ఆ.. కలిసే దాకా.. అనుకోలేదూ.. తీయనీ స్నేహమనీ.. సనిరీసనీ.. నీన్నీన్నీ.. నిరీ నిరీన్నీ దనీదనీద్దా మాద సస్సాస్సా.. మగదమగా మగమాగా గాదమాదమద నీమగామగమ దాగరీగరిగ సారినీరినిరి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆఆఆ మా.. రిమదప మరిమరి సరిమరి సరిసద దసరి సరిమ పెదవి నేనుగా, పదము నీవుగా, ఎదలు పాడనీ.. మానస వీ..ణా మధు గీతం.. మన సంసారం సంగీతం సాగర మధనం అమృత మధురం సంగమ, సరిగమ, స్వర పారిజాతం మానస వీ..ణా మధు గీతం.. మన సంసారం సంగీతం సంసారం.. సంగీతం.. సంసారం.. సంగీ...తం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి