10, ఫిబ్రవరి 2022, గురువారం

Sri vaariki Premalekha : Manasaa Thullipadake Song Lyrics (మనసా తుళ్ళిపడకే)

చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ (1984)

గీత రచయిత : వేటూరి సుందరరామమూర్తి గారు సంగీతం : రమేష్ నాయుడు గారు గానం : ఎస్. జానకి గారు



మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావొ లేదో ఆ శుభఘడియా వచ్చేనొ రాదో తొందరపడితే అలుసే మనసా ... తెలుసా మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే ఏమంత అందాలు కలవనీ .....  వస్తాడు నిన్ను వలచి ఏమంత సిరి ఉంది నీకనీ .....  మురిసేను నిన్ను తలచి చదువా ..... పదవా ..... ఏముంది నీకు తళుకు ..... కులుకు ..... లేవమ్మ నీకు శ్రుతిమించకే నీవు మనసా మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావొ లేదో ఆ శుభఘడియా వచ్చేనొ రాదో తొందరపడితే అలుసే మనసా .....తెలుసా మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే ఏ నోము నోచావు నీవనీ .....  దొరికేను ఆ ప్రేమఫలము ఏ దేవుడిస్తాడు నీకనీ .....  అరుదైన అంత  వరము మనసా వినవే మహ అందగాడు కనుకా జతగా మనకందిరాడు కలలాపవే కన్నె మనసా మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే అతనికి నీవు నచ్చావొ లేదో ఆ శుభఘడియా వచ్చేనొ రాదో తొందరపడితే అలుసే మనసా .....తెలుసా మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి