చిత్రం: పూజ (1975)
గానం: పి. సుశీల
సాహిత్యం: త్యాగరాయ
సంగీతం: రాజన్, నాగేంద్ర
పూజలు చేయ పూలు తెచ్చాను పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులనూ రామా ఈయరా దర్శనము రామా పూజలు చేయ పూలు తెచ్చాను తూరుపులోన తెలతెలవారే బంగరు వెలుగు నింగిని చేరే తొలికిరణాలా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ... తొలికిరణాల హారతి వెలిగే ఇంకా జాగేల స్వామీ ఈయరా దర్శనమూ రామా పూజలు చేయ పూలు తెచ్చాను దీవించేవో కోపించేవో చెంతకు చేర్చీ లాలించేవో నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి నిన్నే నమ్మితిరా స్వామీ ఈయరా దర్శనము రామా పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను ఈయరా దర్శనము రామా పూజలు చేయ పూలు తెచ్చాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి