చిత్రం: సప్తపది (1981)
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.జానకి
సంగీతం: కె వి మహదేవన్
నెమలికి నేర్పిన నడకలివీ.. మురళికి అందని పలుకులువీ.. శృంగార సంగీత నృత్యాభినయ వేళ.. చూడాలి నా నాట్యలీల!! నెమలికి నేర్పిన నడకలివీ.. మురళికి అందని పలుకులువీ.. శృంగార సంగీత నృత్యాభినయ వేళ.. చూడాలి నా నాట్యలీల!! నెమలికి నేర్పిన ఆ ఆ ఆ ఆ నెమలికి నేర్పిన నడకలివీ.. కలహంసలకిచ్చిన పదగతులు.. ఎల కోయిల మెచ్చిన స్వరజతులు.. కలహంసలకిచ్చిన పదగతులు.. ఎల కోయిల మెచ్చిన స్వరజతులు.. ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు.. ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు!! కలిసి, మెలిసి, కళలు విరిసి, మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనా వల్ప శిల్పమణి మేఖలను.. శకుంతలను.!! ఓ ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివీ.. చిరునవ్వులు అభినవ మల్లికలు.. సిరిమువ్వలు అభినయ గీతికలు.. చిరునవ్వులు అభినవ మల్లికలు.. సిరిమువ్వలు అభినయ గీతికలు.. నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు.. నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు.. కురులు విరిసి, మరులు కురిసి, మురిసిన రవివర్మ చిత్రలేఖనా లేఖ్య సరస సౌందర్య రేఖను.. శశిరేఖను!! ఓ ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివీ.. మురళికి అందని పలుకులువీ.. శృంగార సంగీత నృత్యాభినయ వేళ.. చూడాలి నా నాట్యలీల!! నెమలికి నేర్పిన నడకలివీ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి