Saptapadi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Saptapadi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఫిబ్రవరి 2022, గురువారం

Saptapadi : Bhamane Satyabhamane Song Lyrics (భామనే! సత్య భామనే!)

చిత్రం: సప్తపది (1981)

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.జానకి

సంగీతం: కె వి మహదేవన్



భామనే! సత్య భామనే! సత్య భామనే సత్య భామనే . సత్య భామనే సత్య భామనే . వయ్యారి ముద్దుల... వయ్యారి ముద్దుల సత్యా భామనే. సత్య భామనే. భామనే పదియారువేల కోమలులందరిలోనా. భామనే పదియారువేల కోమలులందరిలో. లలనా చెలియా! మగువా సఖియా! రామరో గోపాలదేవుని ప్రేమను దోచినదాన. రామరో గోపాలదేవుని ప్రేమను దోచిన సత్య భామనే... . సత్యా భామనే . ఇంతినే... చామంతినే... మరుదంతినే... విరిబంతినే... ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే. జాణతనమున సతులలో... జాణతనమున సతులలో... నెరజాణనై! నెరజాణనై! నెరజాణనై వెలిగేటిదాన భామనే... సత్య భామనే! అందమున అనందమున గొవిందునకు నేరవిందునై అందమున అనందమున గొవిందునకు నేరవిందునై నందనందుని ఎందుగానక నందనందుని ఎందుగానక బేందమందున పొందుచున్న భామనే... సత్య భామనే! సత్య భామనే సత్య భామనే .

Saptapadi : Govullu Tellana Song Lyrics (గోవుల్లు తెల్లన )

చిత్రం: సప్తపది (1981)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి

సంగీతం: కె వి మహదేవన్



గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన  గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన  గోధూళి ఎర్రన ఎందువలన ......

తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా..ఎందుకుండవ్  కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా.. ఏమో   తెల్లావు కడుపుల్లో కర్రావులుండవాకర్రావు కడుపున ఎర్రావు పుట్టదా గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా  ఆ పొద్దు పొడిచేనా.. ఈ పొద్దు గడిచేనా..  ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే  దైవఘటన  గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన  గోధూళి ఎర్రన ఎందువలన పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు..  పాపం  అల్లన మోవికి తాకితే గేయాలు.. హా హా హ  పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలుఅల్లన మోవికి తాకితే గేయాలు ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండెగొంతులో ఈ పాట నిండదా  ఈ కడిమి పూసేనా.. ఆ కలిమి చూసేనా..  ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే  దైవఘటన  గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన 

Saptapadi : Nemaliki Nerpina Song Lyrics (నెమలికి నేర్పిన నడకలివీ..)

చిత్రం: సప్తపది (1981)

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.జానకి

సంగీతం: కె వి మహదేవన్



నెమలికి నేర్పిన నడకలివీ.. మురళికి అందని పలుకులువీ.. శృంగార సంగీత నృత్యాభినయ వేళ.. చూడాలి నా నాట్యలీల!! నెమలికి నేర్పిన నడకలివీ.. మురళికి అందని పలుకులువీ.. శృంగార సంగీత నృత్యాభినయ వేళ.. చూడాలి నా నాట్యలీల!! నెమలికి నేర్పిన ఆ ఆ ఆ ఆ నెమలికి నేర్పిన నడకలివీ.. కలహంసలకిచ్చిన పదగతులు.. ఎల కోయిల మెచ్చిన స్వరజతులు.. కలహంసలకిచ్చిన పదగతులు.. ఎల కోయిల మెచ్చిన స్వరజతులు.. ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు.. ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు..ఏవేవో కన్నుల కిన్నెరలు!! కలిసి, మెలిసి, కళలు విరిసి, మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనా వల్ప శిల్పమణి మేఖలను.. శకుంతలను.!! ఓ ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివీ.. చిరునవ్వులు అభినవ మల్లికలు.. సిరిమువ్వలు అభినయ గీతికలు.. చిరునవ్వులు అభినవ మల్లికలు.. సిరిమువ్వలు అభినయ గీతికలు.. నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు.. నీలాల కన్నుల్లో తారకలు.. తారడే చూపుల్లో చంద్రికలు.. కురులు విరిసి, మరులు కురిసి, మురిసిన రవివర్మ చిత్రలేఖనా లేఖ్య సరస సౌందర్య రేఖను.. శశిరేఖను!! ఓ ఓ ఓ నెమలికి నేర్పిన నడకలివీ.. మురళికి అందని పలుకులువీ.. శృంగార సంగీత నృత్యాభినయ వేళ.. చూడాలి నా నాట్యలీల!! నెమలికి నేర్పిన నడకలివీ..

Sapthapadi : Om Jaata Vedasasu Song Lyrics (ఓం ॥ జా॒తవే॑దసే )

చిత్రం: సప్తపది (1981)

సాహిత్యం:

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి

సంగీతం: కె వి మహదేవన్



ఓం ॥ జా॒తవే॑దసే సునవామ॒ సోమ॑ మరాతీయ॒తో నిద॑హాతి॒ వేదః॑ । స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॑ నా॒వేవ॒ సింధుం॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥ తామ॒గ్నివ॑ర్ణాం తప॑సా జ్వలం॒తీం వై॑రోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టాం᳚ । దు॒ర్గాం దే॒వీగ్ం శర॑ణమ॒హం ప్రప॑ద్యే సు॒తర॑సి తరసే॑ నమః॑ ॥ అగ్నే॒ త్వం పా॑రయా॒ నవ్యో॑ అ॒స్మాంథ్-స్వ॒స్తిభి॒రతి॑ దు॒ర్గాణి॒ విశ్వా᳚ । పూశ్చ॑ పృ॒థ్వీ బ॑హు॒లా న॑ ఉ॒ర్వీ భవా॑ తో॒కాయ॒ తన॑యాయ॒ శంయోః ॥ విశ్వా॑ని నో దు॒ర్గహా॑ జాతవేదః॒ సింధు॒న్న నా॒వా దు॑రి॒తాఽతి॑పర్-షి । అగ్నే॑ అత్రి॒వన్మన॑సా గృణా॒నో᳚ఽస్మాకం॑ బోధ్యవి॒తా త॒నూనాం᳚ ॥ పృ॒త॒నా॒ జిత॒గ్ం॒ సహ॑మానము॒గ్రమ॒గ్నిగ్ం హు॑వేమ పర॒మాథ్-స॒ధస్థా᳚త్ । స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॒ క్షామ॑ద్దే॒వో అతి॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥ ప్ర॒త్నోషి॑ క॒మీడ్యో॑ అధ్వ॒రేషు॑ స॒నాచ్చ॒ హోతా॒ నవ్య॑శ్చ సత్సి॑ । స్వాంచా᳚ఽగ్నే త॒నువం॑ పి॒ప్రయ॑స్వా॒స్మభ్యం॑ చ॒ సౌభ॑గ॒మాయ॑జస్వ ॥ గోభి॒ర్జుష్ట॑మయుజో॒ నిషి॑క్తం॒ తవేం᳚ద్ర విష్ణో॒రను॒సంచ॑రేమ । నాక॑స్య పృ॒ష్ఠమ॒భి సం॒వసా॑నో॒ వైష్ణ॑వీం లో॒క ఇ॒హ మా॑దయంతాం ॥ ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి । తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా᳚త్ ॥

Saptapadi : Ayigiri Nandini Song Lyrics (అయిగిరి నందిని)

చిత్రం: సప్తపది (1981)

సాహిత్యం: ఆది శంకరాచార్య

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: కె వి మహదేవన్



అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే | గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే || భగవతి హేశితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||1|| సురవర వర్షిణి దుర్ధర ధర్షిణి దుర్ముఖ మర్షిణి హర్షరతే | త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మష మోచని ఘోరరతే || దనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||2|| అయి జగదంబ కదంబవన ప్రియవాసవిలాసిని వాసరతే | శిఖరిశిరోమణి తుంగహిమాలయశృంగ నిజాలయ మధ్యగతే || మధుమధురే మధుకైటభభంజని కైటభభంజని రాసర తే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||3|| అయినిజ హుంకృతిమాతృ నిరాకృతి ధూమ్రవిలోచని ధూమ్రశిఖే సమరవిశోణిత బీజసముద్భవ బీజలతాధిక బీజలతే || శివశివ శుంభ నిశుంభ మహాహవ దర్పిత భూతపిశాచపతే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||4|| అయి భో శతమఖి ఖండిత కుండలి తుండిత ముండ గజాధిప తే | రిపుగజగండ విదారణఖండ పరాక్రమ శౌండ మృగాధిప తే || నిజ భుజదండవిపాతిత చండ నిపాతిత ముండ భటాధిప తే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||5|| హయ రణ మర్మర శాత్రవదోర్దుర దుర్జయ నిర్జయశక్తిభృ తే | చతురవిచార ధురీణ మహాశివదూతకృత ప్రమథాధిప తే || దురిత దురీహ దురాశయ దుర్మద దానవదూత దురంతగ తే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||6|| అయిశరనాగత వైరివధూవర కీర వరాభయ దాయ కరే | త్రిభువన మస్తక శూల విరోధి నిరోధ కృతామల స్థూలకరే || దుర్నమితా వర దుందుభినాద ముహుర్ముఖరీకృత దీనకరే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||7|| సురలలనాతత ధేయిత ధేయిత తాళనిమిత్తజ లాస్య రతే | కకుభాం పతివరధోం గత తాలకతాల కుతూహల నాద రతే || ధింధిం ధిమికిట ధిందిమితధ్వని ధీరమృదంగ నినాదరతే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||8|| ఝణ ఝణ ఝణ హింకృత సురనూపుర రంజిత మోహిత భూతపతే | నటిత నటార్ధ నటీనటనాయుత నాటిత నాటక నాట్యరతే || పవనతపాలిని ఫాలవిలోచని పద్మ విలాసిని విశ్వధురే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||9|| దనుజసుసంగర రక్షణ సంగపరిస్ఫుర దంగనటత్కటకే | కనక నిషంగ పృషత్క నిషంగ రసద్భట భృంగహటాచటకే || హతిచతురంగ బలక్షితిరంగ ఘటద్భహు రంగ వలత్కటకే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |10| మహిత మహాహవ మల్ల మతల్లిక వేల్లకటిల్లక భిక్షురతే | విరచితవల్లిక పల్లిక గేల్లిక మల్లిక భిల్లిక వర్గభృతే || భృతికృతపుల్ల సముల్లసితారుణపల్లవ తల్లజ సల్లలితే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |11| అయితవసు మనస్సు మనస్సు మనోహర కాంతి లసత్కల కాంతియుతే | నుతరజనీ రజనీ రజనీ రజనీకర వక్తృ విలాసకృతే || సునవర నయన సువిభ్రమద భ్రమర భ్రమరాధిప విశ్వనుతే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |12| అవిరల గండక లన్మద మేదుర మత్తమతంగజరాజగతే | త్రిభువన భూషణభూత కళానిధి రూపపయోనిధి రాజనుతే || అయి సుదతీజనలాలస మానసమోహన మన్మథరాజసుతే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |13| కమలదళామల కోమలకాంతి కళాకలితాకుల బాల లతే | సకలకళా నిజయ క్రమకేళి చలత్కలహంస కులాలి కులే || అలికులసంకుల కువలయమండిత మౌలిమిలత్స మదాలికులే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |14| కలమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల మంజురతే | మిళిత మిళింద మనోహరగుంభిత రంజితశైలనికుంజగతే || మృగగణభూత మహాశబరీగణ రింగణ సంభృతకేళిభృతే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |15| కటితటనీత దుకూల విచిత్రమయూఖ సురంజిత చంద్రకళే | నిజ కనకాచల మౌలిపయోగత నిర్జర కుంజర భీమరుచే || ప్రణత సురాసుర మౌళిమణిస్ఫురదంశు లతాధిక చంద్రరుచే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |16| విజితసహస్ర కరైక సహస్ర సుధా సమరూప కరైకనుతే | కృతసుతతారక సంగరతారక తారక సాగర సంగనుతే || గజముఖ షణ్ముఖ రంజిత పార్శ్వ సుశోభిత మానస కంజపుటే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |17| పదకమలంకమలానిలయే పరివస్యతి యో నుదినం స శివే | అయికమలే విమలే కమలానిలశీకర సేవ్య ముఖాబ్జ శివే || తవ పద మద్య హి శివదం దృష్టిపథం గతమస్తు మఖిన్న శివే | జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే |18| ||జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే|| ||జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే|| || ఇతి శ్రీ మహిషాసుర మర్దిని స్తోత్రం సంపూర్ణం ||