30, మార్చి 2022, బుధవారం

Adavi Ramudu : Krushivunte Manushulu Song

చిత్రం: అడవి రాముడు (1977)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: కె. వి. మహదేవన్



మనిషై పుట్టిన వాడు కారాదు మట్టిబొమ్మ పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలిటి అడుగో అతడే వాల్మీకి పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకుని పరవిశించి పోయే వేళ ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు ఒక పక్షిని నేల కూల్చాడు జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ తన కంటిలో పొంగ మనసు కరగంగా ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు నవరస భరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమృతం ఆ వాల్మీకి మీ వాడు మీలోనే వున్నాడు అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే వుంటాడు అందుకే కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు బొమ్మ గురుతుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు హుటాహుటిని ద్రోణుడపుడు తటాలుమని తరలి వచ్చి పక్షపాత బుద్దితో దక్షిణ ఇమ్మన్నాడు ఎదుట నిలిచిన గురుని పదమంటి ఏమివ్వగలవాడననె ఏకలవ్యుడు బొటనవ్రేలివ్వమనే కపటి ఆ ద్రోణుడు వల్లేయనే శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు ఎరుకలవాడు అయితేనేమి గురికల వాడే మొనగాడు వేలునిచ్చి తన విల్లును విడిచి వేలువుగా ఇలా వెలిగాడు అందుకే కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు శబరీ ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి ఆశ కరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది వంగిపోయిన నడుముతో నగుమోము చూడగ లేక అపుడు కనుల నీరిడి ఆ రామ పాదము కడిగినది శబరి పదముల ఒరిగినది శబరి ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి కోరి కోరి శబరి కొరికిన దోర పండ్లను ఆరగించే ఆమె ఎంగిలి గంగ కన్నా మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడో ఆ శబరిదెంతటి పుణ్యమో ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరీ నాటికీ అడివిని పుట్టి పెరిగిన కధలే అఖిల భారతికి హారతులు నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారధులు అందుకే కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి