31, మార్చి 2022, గురువారం

Manusulantha okkate : Mutyalu Vasthava Song

చిత్రం: మనుషులంతా ఒక్కటే (1976)

సాహిత్యం: కొసరాజు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు



ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా.. ఊర్వశిలా ఇటు రావే వయారీ చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను.. తొందరపడితే లాభం లేదయో నీ జారు ఫైట ఊరిస్తు ఉందీ... నీ కొంటే చూపు కోరికేస్తు ఉందీ నీ జారు ఫైట ఊరిస్తు ఉందీ.. నీ కొంటే చూపు కోరికేస్తు ఉందీ.. కన్నూ కన్నూ ఎపుడో కలిసిందీ ఏదయ్యగోల.. సిగ్గేమి లేదా.. ఊరోళ్ళు వింటే ఎగతాళి గాదా ఏదయ్యగోల.. సిగ్గేమి లేదా.. ఊరోళ్ళు వింటే ఎగతాళి గాదా.. నిన్నూ నన్నూ చూస్తే నామరదా ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా.. ఊర్వశిలా ఇటు రావే వయారీ పరిమినెంటుగాను నిన్ను చేసుకొంటాను.. ఉన్నదంత ఇచ్చెసి నిన్ను చూసుకుంటాను ఇంటా బయటా పట్టుకునుంటానూ.. అహా... ఒహో.. ఏహే.. ఏ.. ఏరుదాటిపోయాక తెప్ప తగల ఏస్తేను.. ఊరంతా తెలిసాక వదలి పెట్టి పోతేను బండకేసి నిను బాదేస్తానయ్యో.. రేవులోన నిను ముంచేస్తానయ్యో ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా.. ఊర్వశిలా ఇటు రావే వయారీ చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను.. తొందరపడితే లాభం లేదయో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి