3, మార్చి 2022, గురువారం

Aggi Dora : Oi Thirumalesa Song Lyrics (ఓ తిరుమలేశా..)

చిత్రం: అగ్గి దొర (1967)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: ఘంటసాల, పి.సుశీల

సంగీతం: విజయా కృష్ణమూర్తి



ఓ తిరుమలేశా..చాలు చాలు ఈ శోధన భరియించలేనయ్య, మొరవినవేమి ఓ తిరుమలేశా.. పిలిచిన పలికెవు స్వామీ ..... పిలిచిన పలికెవు స్వామి... శిలాగా నిలిచేవేమి.... పిలిచిన పలికెవు స్వామి... శిలాగా నిలిచేవేమి... పిలిచిన పలికెవు స్వామి... కాంతిని చూసే కన్నులలోనే కన్నీరే నింపేవా.... ఆ ఆ ఆ ఆ కాంతిని చూసే కన్నులలోనే .. కన్నీరే నింపేవా.. ఏడువాజేసి వేడుట చూసి.. వేడుక చూసేవేమి...... ఏడువాజేసీ వేడుటచూసి... వేడుక చూసేవేమి.... పిలిచిన పలికెవు స్వామి శిలగా నిలచేవేమి. పిలిచిన పలికెవు స్వామి.. శిలాగా నిలచేవేమి... మనిషిని చేసి మనసును పోసి మలినమునే నింపేవా..ఆ ఆ ఆ ఆ మనిషిని చేసి మనసును పోసి... మలినమునే నింపేవా.. పువ్వులలోన వాసన తోనే. పురుగులు నింపేవేమి పువ్వులలోన వాసనతోనే.. పురుగులు నింపేవేమి పిలిచిన పలికెవు స్వామి శిలాగా నిలచేవేమి.. పిలిచిన పలికెవు స్వామి శిలాగా నిలచేవేమి....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి