చిత్రం: ఇల్లాలు (1981)
సంగీతం: చక్రవర్తి రచన: ఆత్రేయ గానం: K.J. ఏసుదాసు, శైలజ ఓ బాటసారి ఇది జీవిత రహదారి ఎంత దూరమో ఏది అంతమో ఎవరు ఎరుగని దారి ఇది ఒకరికె సొంతం కాదు ఇది ఎవరు ఎవరికి తోడౌతారో ఎప్పుడెందుకు విడిపోతారో మమతను కాదని వెళతారో మనసే చాలని ఉంటారో ఎవ్వరి పయనం ఎందాకో అడగదు ఎవ్వరిని బదులే దొరకదని కడుపుతీపికి ఋజువేముంది అంతకు మించిన నిజమేముంది కాయే చెట్టుకు బరువైతే చెట్టును భూమి మోస్తుందా? ఇప్పుడు తప్పులు తెలుసుకొని జరిగేదేమిటని క్షమించదెవ్వరిని తెంచుకుంటివి అనుబంధాన్ని పెంచుకున్నదొక హృదయం దాన్ని అమ్మలిద్దరు ఉంటారని అనుకోలేని పసివాణ్ణి బలవంతాన తెచ్చుకొని తల్లివి కాగలవా? తనయుడు కాగలడా? అడ్డ దారిలో వచ్చావమ్మా అనుకోకుండా కలిసావమ్మ నెత్తురు పంచి ఇచ్చావు నిప్పును నువ్వే మింగావు ఆడదాని ఐశ్వర్యమేమిటో ఇప్పుడు తెలిసింది కథ ముగిసేపోయింది
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి