చిత్రం: ఏక వీర (1969)
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కె. వి. మహదేవన్
కలువ పూల చెంత చేరి కైమోడుపు సేతునూ… నా కలికి మిన్న కన్నులలో…. కల కల మని విరియాలనీ… మబ్బులతో ఒక్కమారు, మనవి చేసికొందును నా అంగన, ఆలంగనమున ముంగురులై కదలాలనీ… చుక్కలతొ ఒక్క సారి చూచింతును నా ప్రెయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలనీ... పూర్ణ సుధాకర బింభబునకు వినతిసేతును నా పడతికీ ... ముఖబింభమై… కలలు దిద్దుకోవాలనీ... ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థింతును కడసారిగా........................... నా రమణికీ... బదులుగా... ఆకారము దరియించాలనీ…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి