26, మార్చి 2022, శనివారం

Sridevi : Rasanu Premalekhalenno Song Lyrics (రాశాను ప్రేమలేఖలెన్నో)

చిత్రం: శ్రీదేవి (1970)

సాహిత్యం: దాశరధి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: జి.కె.వెంకటేష్


రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో భువిలోన మల్లియలాయే దివిలోన తారకలాయే నీ నవ్వులే రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో భువిలోన మల్లియలాయే  దివిలోన తారకలాయే నీ నవ్వులే కొమ్మల్లో కోయిలమ్మా.. కోయ్ అన్నది కొమ్మల్లో కోయిలమ్మా కోయ్ అన్నది నా మనసు నిన్నే తలచీ ఓయన్నదీ మురిపించే ముద్దు గులాబి మొగ్గేసింది చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో భువిలోన మల్లియలాయే దివిలోన తారకలాయే నీ నవ్వులే ఆ.... ఆ.... ఆ.... ఆ.... ఆ... నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో ఊహూ.. నీ చల్లని రూపం ఉందీ నా కనులలో హా నాలోని సోయగమంతా విరబూసెలే నాలోని సోయగమంతా విరబూసెలే మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే రాశాను ప్రేమలేఖలెన్నో  దాచాను ఆశలన్ని నీలో భువిలోన మల్లియలాయే దివిలోన తారకలాయే నీ నవ్వులే ఊ..ఊ..ఊ..ఊ...ఊ... ఆ... ఆ.. అందాలా పయ్యెద నేనై ఆటాడనా ఆ.. కురులందు కుసుమం నేనై చెలరేగనా.. ఆ.. నీ చేతుల వీణను నేనై పాట పాడనా నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో  ఆ.... ఆ.... ఆ.... ఆ.... ఆ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి