చిత్రం: గోపాలుడు భూపాలుడు (1967)
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి.సుశీల
సంగీతం: యస్.పి. కోదండ పాణి
ఒకసారి కలలోకి రావయ్యా. ఒకసారి కలలోకి రావయ్యా. నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా ఓ గొల్ల గోపయ్యా ... ఒకసారి రాగానే ఏమౌనులే . నీ హృదయాన శయనించి ఉంటానులే . ఏలుకుంటానులే ... ఒకసారి రాగానే ఏమౌనులే. పగడాల నా మోవి చిగురించెరా . మోము చెమరించెరా . మేను పులకించెరా. సొగసు వేణువు చేసి పలికించరా. సొగసు వేణువు చేసి పలికించరా. కెమ్మోవి పై తేనె ఒలికించనా ... కెమ్మోవి పై తేనె ఒలికించనా. తనివి కలిగించనా మనసు కరిగించనా. కేరింతలాడించి సోలించనా . కేరింతలాడించి సోలించనా. ఒకసారి కలలోకి రావయ్యా . ఒంపుసొంపుల మెరుపు మెరిపించవే. వగలు కురిపించవే మేను మరపించవే. మరపులో మధుకీల రగిలించవే . మరపులో మధుకీల రగిలించవే. చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా . చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా మొగ్గ తొడిగిందిరా మురిసి విరిసిందిరా పదును తేలిన వలపు పండించరా. పదును తేలిన వలపు పండించరా. ఒకసారి కలలోకి రావయ్యా . నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా ఓ గొల్ల గోపయ్యా ... ఒకసారి రాగానే ఏమౌనులే .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి