28, మార్చి 2022, సోమవారం

Kalpana : Oka Udayamlo song lyrics (ఒక ఉదయంలో.)

చిత్రం: కల్పన (1977)

సాహిత్యం : వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: చక్రవర్తి 



పల్లవి: ఇది నా కల్పన.. కవితాలాపన.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఒక ఉదయంలో... నా హృదయంలో ఒక ఉదయంలో... నా హృదయంలో విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన ఒక ఉదయంలో... నా హృదయంలో విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. చరణం 1: తార తారకి నడుమ ఆకాశం ఎందుకో పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో.. తార తారకి నడుమ ఆకాశం ఎందుకో పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో.. మనిషి మనిషికీ మద్య మనసనేది ఎందుకో మనసే గుడిగా.. మనిషికి ముడిగా.. మమత ఎందుకో.. మమత ఎందుకో.. తెలియని ఆవేదనే ఆలాపన తెలుసుకున్న వేదనే కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన... ఒక ఉదయంలో... నా హృదయంలో విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. చరణం 2: దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే కవి మనస్సులో ఉషస్సు కారు చీకటౌతుంటే మిగిలిన కథలో.. పగిలిన ఎదలో.. ఈ కవితలెందుకో.. కవితలెందుకో.. తెలియని ఆవేదనే ఆలాపన తెలుసుకున్న వేదనే కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన.. ఒక ఉదయంలో... నా హృదయంలో విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి