Kalpana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kalpana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఏప్రిల్ 2022, ఆదివారం

Kalpana : Dikkulu Choodaku Ramayya Song Lyrics (దిక్కులు చూడకు రామయ్య )

చిత్రం: కల్పన (1977)

సాహిత్యం : వేటూరి

గానం: జి.ఆనంద్

సంగీతం: చక్రవర్తి 



దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ  దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ సీతమ్మ  సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ  సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ  ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగి ఉంటావో  ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగి ఉంటావో  కదలికలన్నీ కథలుగ అల్లి కవితలే రాసుకుంటావో రామయ్య  పొన్నలు పూచిన నవ్వు సిరివెన్నెల దోచి నాకివ్వు  పొన్నలు పూచిన నవ్వు సిరివెన్నెల దోచి నాకివ్వు  ఆ వెన్నెలలో నీ కన్నులలో... ఆ వెన్నెలలో నీ కన్నులలో...  సన్నజాజులే రువ్వు కను సన్నజాజులే రువ్వు  సన్నజాజులే రువ్వు కను సన్నజాజులే రువ్వు  సీతమ్మ... సీతమ్మ...  దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ  సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ  కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో  కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో  కలలిక మాని కలయికలో నా కన్నులలో చూసుకుంటావో రామయ్య  వెల్లువలైనది సొగసు తొలివేకువ నీ మనసు  వెల్లువలైనది సొగసు తొలివేకువ నీ మనసు  ఆ వెల్లువలో నా పల్లవిలో... ఆ వెల్లువలో నా పల్లవిలో...  రాగమే పలికించు అనురాగమై పులకించు  రాగమే పలికించు అనురాగమై పులకించు  సీతమ్మ... సీతమ్మ...  దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ  సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ

28, మార్చి 2022, సోమవారం

Kalpana : Oka Udayamlo song lyrics (ఒక ఉదయంలో.)

చిత్రం: కల్పన (1977)

సాహిత్యం : వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: చక్రవర్తి 



పల్లవి: ఇది నా కల్పన.. కవితాలాపన.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఒక ఉదయంలో... నా హృదయంలో ఒక ఉదయంలో... నా హృదయంలో విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన ఒక ఉదయంలో... నా హృదయంలో విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. చరణం 1: తార తారకి నడుమ ఆకాశం ఎందుకో పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో.. తార తారకి నడుమ ఆకాశం ఎందుకో పాట పాటకి నడుమ ఆవేశం ఎందుకో.. మనిషి మనిషికీ మద్య మనసనేది ఎందుకో మనసే గుడిగా.. మనిషికి ముడిగా.. మమత ఎందుకో.. మమత ఎందుకో.. తెలియని ఆవేదనే ఆలాపన తెలుసుకున్న వేదనే కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన... ఒక ఉదయంలో... నా హృదయంలో విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. చరణం 2: దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే కవి మనస్సులో ఉషస్సు కారు చీకటౌతుంటే మిగిలిన కథలో.. పగిలిన ఎదలో.. ఈ కవితలెందుకో.. కవితలెందుకో.. తెలియని ఆవేదనే ఆలాపన తెలుసుకున్న వేదనే కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన.. ఒక ఉదయంలో... నా హృదయంలో విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. విరిసిన మందారం.. మెరిసిన సింధూరం.. కల్పనా.. అది ఒక కల్పన.. అది నా కల్పన