28, మార్చి 2022, సోమవారం

Kanchana Ganga : Vanitha Latha Kavitha Song Lyrics (వనిత లతా కవిత)

చిత్రం: కాంచన గంగ (1984)

సాహిత్యం: సి.నారాయణ రెడ్డి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: చక్రవర్తి



వనిత లతా కవిత మనలేవు లేక జత వనిత లతా కవిత మనలేవు లేక జత ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత మనసివ్వడమే మమత వనిత లతా కవిత మనలేవు లేక జత

పూలురాలి నేలకూలి తీగబాల సాగలేదు చెట్టులేక అల్లుకోక పువ్వు రాదు నవ్వలేరు మోడు మోడని తిట్టుకున్నా తోడు విడిచేనా పులకరించే కొత్త ఆశ తొలగి పోయేనా వనిత లతా కవిత మనలేవు లేక జత వనిత లతా కవిత మనలేవు లేక జత ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత మనసివ్వడమే మమత ఆదరించే ప్రభుతలేక కావ్యభాల నిలువ లేదు వనిత అయినా కవిత అయినా ప్రేమలేక పెరగలేదు చేదు చేదని తిట్టుకున్నా చెలిమి విడిచేనా చేదుమింగి తీపినీకై పంచమరిచేనా ...... వనిత లతా కవిత మనలేవు లేక జత

తనది అన్న గూడులేక కన్నెబాల బ్రతకలేవు నాది అన్న తోడులేక నిలువలేదు విలువలేదు పీడ పీడని తిట్టుకున్నా నీడవిడిచేనా వెలుగులోనా నీడలోనా నిన్ను నడిపేనా  ..... వనిత లతా కవిత మనలేవు లేక జత వనిత లతా కవిత మనలేవు లేక జత ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత మనసివ్వడమే మమత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి