28, మార్చి 2022, సోమవారం

Preminchu Pelladu : Nirantaram Vasanthamule Song Lyrics ( నిరంతరమూ వసంతములే)

చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)

సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి


నిరంతరమూ వసంతములే మందారములా మరందములే స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండె నిరంతరమూ వసంతములే మందారములా మరందములే నిరంతరమూ వసంతములే మందారములా మరందములే స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండె నిరంతరమూ వసంతములే మందారములా మరందములే హాయిగా పాటపాడే కోయిలె మాకు నేస్తం తేనెలో తానమాడె తుమ్మెదే మాకు చుట్టం నదులలో వీణమీటే తెమ్మెరే మాకు ప్రాణం అలలపై నాట్యమాడె వెన్నెలే వేణుగానం ఆకశానికవి తారలా ఆశకున్న విరి దారులా ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటె నిరంతరమూ వసంతములే మందారములా మరందములే స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండె నిరంతరము వసంతములే మందారములా మరందములే అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే మెరుపులేఖల్లు రాసి మేఘమై మూగవోయే మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే మాఘ దాహాలలోనా అందమే అప్సరాయే మల్లె కొమ్మ చిరునవ్వులా మనసులోని మరు దివ్వెలా ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే నిరంతరమూ వసంతములే మందారములా మరందములే స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండె నిరంతరమూ వసంతములే మందారములా మరందములే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి