చిత్రం: కోడలు దిద్దిన కాపురం (1970)
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: పి.సుశీల
సంగీతం: టి.వి. రాజు
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు సత్యం కోసం సతినే అమ్మినదెవరు - హరిశ్చంద్రుడు తండ్రి మాటకై కానలకేగినదెవరు - శ్రీ రామచంద్రుడు అన్న సేవకే అంకితమైనదెవరన్న - లక్ష్మన్న పతియే దైవమని తరించిపోయినదెవరమ్మా - సీతమ్మ ఆ పుణ్య మూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం అనుసరించుటే నీ ధర్మం నీ ధర్మం మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు చాప కూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న మేడి పండులా మెరిసే సంఘం గుట్టువిప్పెను వేమన్న వితంతుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజలభాషలో తీరిచిదిద్దెను గురజాడ ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం నీ సంఘం మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు స్వతంత్రభారత రథసారధియై సమరాన దూకె నేతాజీ సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ గుండుకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవి ఆ దేశ భక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం నీవు పుట్టిన ఈ దేశం నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి