17, మార్చి 2022, గురువారం

Kondaveeti Simham: Vaanochche Varadochche Song Lyrics (వానొచ్చే వరదొచ్చే)

చిత్రం: కొండవీటి సింహం (1981)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి


M : వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే నీలో గోదారి పొంగే.. నీ పొంగులలో మునిగి నీ కౌగిలిలో కరిగి అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే F :వానొచ్చే వరదొచ్చే వలపించే మనసిచ్చే నీలో నా ఈడు పొంగే.. నీ మాటలకే అలిగి నీ పాటలలో మెలిగి కళలెన్నో పులకించి కౌగిళ్ళు చేరే F: ఆకాశమంతా పందిళ్ళు వేసి భూలోకమంతా పీటళ్ళు వేసి ఆకాశమంతా పందిళ్ళు వేసి భూలోకమంతా పీటళ్ళు వేసి M : కౌగిళ్ళలోనే..నా ఇల్లు చూసి నీ కళ్ళతోనే.. ఆ ముళ్ళు వేసి F:త్వరపడి మది చొరపడి నీ.. జత చేరితే.. M:ఒరవడి నా చెలి ఒడిలో.. చెలరేగితే.. F:నాలో.. నీలో  తొలి కోరిక.. చలి తీరక..  నిను చేరగా .. తనువులు ముడిపడినవి ఈ చలిగాలిలో.. M: వానొచ్చే వరదొచ్చే వలపల్లే వయసొచ్చే నీలో గోదారి పొంగే.. F: నీ మాటలకే అలిగి నీ పాటలలో మెలిగి కళలెన్నో పులకించి కౌగిళ్ళు చేరే.. M: కార్తీక వేళా.. కన్నుల్లు కలిసే ఏకంత వేళా ఎన్నెల్లు కురిసే కార్తీక వేళా.. కన్నుల్లు కలిసే ఏకంత వేళా ఎన్నెల్లు కురిసే F: నీ చూపులోన సూరీడు మెరిసే నీ ఈడుతోనే నా ఈడు మురిసే.. M: తడి అలజడి చలి ముడిపడి నిను కోరితే F:యడదల సడి పెదవుల బడి సుడిరేగితే.. M: నీవే.. నేనై.. తొలి జంటగా.. చలిమంటలే  ఎదలంటగా రగిలెను సెగలకు వగలీ.. చలిమంటలో.. F: వానొచ్చే వరదొచ్చే వలపించే మనసిచ్చే నీలో నా ఈడు పొంగే.. M: నీ పొంగులలో మునిగి నీ కౌగిలిలో కరిగి అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి