చిత్రం: కొండవీటి సింహం (1981)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి:
పిల్ల ఉంది పిల్లమీద కోరికుంది
చెప్పబోతే జారుకుంది
దానికెట్టా పంపేది గుట్టు కబురు
దానికెట్టా తెలిపేది గుండే గుబులు
పూతపట్టి కూతకొచ్చె పిట్ట వగలు
హోయ్! వేటాగాడు పేటాకంతా
నీటుగాడు వాటమైన వన్నెకాడు
వాడికెట్టా పంపేది గాలి కబురు
పంపలేక వేగింది చింత చిగురు
పాడు ఈడు గోడదిగే పట్టపగలు
పిల్లఉంది పిల్లమీద కోరికుంది
చెప్పబోతే జారుకుంది
చరణం 1:
నిబ్బరంగ ఉన్నాది కన్నె చుక్క ..
ఉబ్బరాల మీదుంది జున్ను ముక్క
నిబ్బరంగ ఉన్నాది కన్నె చుక్క ..
ఉబ్బరాల మీదుంది జున్ను ముక్క
దాన్ని చూసి .. దాని సోకు చూసి
దాన్ని చూసి .. దాని సోకు చూసి
చిటుకుమంటు కొట్టుకుంది చిలిపి కన్ను
చిటుకుమంటు కొట్టుకుంది చిలిపి కన్ను
పుటక దాటి పట్టుకుంది వలపు నన్ను .. అర్రర్రే !
ఒంటిగున్న ఒంటిబాధ ఓపలేను అయ్యో..
ఓపరాల ఈడునింక ఆపలేను
ఒంటిగున్న ఒంటిబాధ ఓపలేను ఆహ..
ఓపరాల ఈడునింక ఆపలేను
వాడికెట్ట చెప్పేది ఒంటి గుట్టు
వాడికెట్ట చెప్పేది ఒంటి గుట్టు
ఎట్ట నేను ఆపేది ఇంత పట్టు
పిల్లఉంది పిల్లమీద కోరికుంది చెప్పబోతే జారుకుంది
వేటాగాడు పేటాకంతా నీటుగాడు వాటమైన వన్నెకాడు
జంట లేని ఇంటి పట్టునుండలేను .. అయ్యో
కొంటె టేనే తీపరాలు టాపలేను .. పాపం
జంటా లేని ఇంటి పట్టునుండలేను .. అహా !
కొటె టేనే తీపరాలు టాపలేను .. చొచ్చో
డికెట్ట సెప్పేది గుండె గుట్టు ....
వాడికెట్ట సెప్పేది గుండె గుట్టు ..
ఏట్టా నాకు తప్పేది గుట్టుమట్టు !
చరణం 2:
చెంప గిల్లి పోతాది వాడి చూపు ..
చెమ్మగిల్లి పోతాది వేడి నాకు
చెంప గిల్లి పోతాది వాడి చూపు ..
చెమ్మగిల్లి పోతాది వేడి నాకు
వాడ్ని చూసి .. వాడి రాక చూసి
వాడ్ని చూసి .. వాడి రాక చూసి
లటుకుమంటు కొట్టుకొంది చిలక ముక్కు
లటుకుమంటు కొట్టుకొంది చిలక ముక్కు
పండు దోచుకోనులేదు నాకు దిక్కు
గొగ్గిలాల గుమ్మసోకు సూడకుంటే
అగ్గిలాంటి ఈడు నాకు భగ్గుమంటే
గొగ్గిలాల గుమ్మసోకు సూడకుంటే
అగ్గిలాంటి ఈడు నాకు భగ్గుమంటే
దానికెట్టా సెప్పేది లోని గుట్టు...
దానికెట్టా సెప్పేది లోని గుట్టు ..
ఎట్టా నాకు దక్కేది తేనెపట్టు !
హోయ్! వేటాగాడు పేటాకంతా
నీటుగాడు వాటమైన వన్నెకాడు
వాడికెట్టా పంపేది గాలి కబురు పంపలేక వేగింది
చింత చిగురు పాడు ఈడు గోడదిగే పట్టపగలు
పిల్లఉంది పిల్లమీద కోరికుంది చెప్పబోతే జారుకుంది
దానికెట్టా పంపేది గుట్టు కబురు
దానికెట్టా తెలిపేది గుండే గుబులు
పూతపట్టి కూతకొచ్చె పిట్ట వగలు