చిత్రం: లేత మనసులు (1966)
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్
కోడి ఒక కోనలో.. పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో కోడి ఒక కోనలో.. పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో *పాలకొరకు లేగదూడ పరుగులెత్తి సాగును (2) పక్షి కూడ కూడు తెచ్చి పంచిపెట్టి మురియును (2) తాతా తెలుసునా.. జాలి కలుగునా (2) విడివిడిగా జీవించే వేదనలే తీరునా ?? వేదనలే తీరునా ?? కోడి ఒక కోనలో.. పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో *పొరుగువాళ్ళ పాపలాగ పెట్టి పుట్టలేదులే (2) అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే (2) అమ్మ మరవదు.. నాన్న తలవడు (2) కన్నవాళ్ళ కలుపుటకు మాకు వయసు లేదులే మీకు మనసు రాదులే !! కోడి ఒక కోనలో.. పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి