Letha Manasulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Letha Manasulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, మార్చి 2022, సోమవారం

Letha Manasulu : kodi oka konalo Punju Oka Konalo Song Lyrics

చిత్రం: లేత మనసులు (1966)

సాహిత్యం: దాశరథి

గానం: పి. సుశీల


సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్





కోడి ఒక కోనలో.. పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో కోడి ఒక కోనలో.. పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో *పాలకొరకు లేగదూడ పరుగులెత్తి సాగును (2) పక్షి కూడ కూడు తెచ్చి పంచిపెట్టి మురియును (2) తాతా తెలుసునా.. జాలి కలుగునా (2) విడివిడిగా జీవించే వేదనలే తీరునా ?? వేదనలే తీరునా ?? కోడి ఒక కోనలో.. పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో *పొరుగువాళ్ళ పాపలాగ పెట్టి పుట్టలేదులే (2) అమ్మతో నాన్నతో హాయి నోచుకోములే (2) అమ్మ మరవదు.. నాన్న తలవడు (2) కన్నవాళ్ళ కలుపుటకు మాకు వయసు లేదులే మీకు మనసు రాదులే !! కోడి ఒక కోనలో.. పుంజు ఒక కోనలో పిల్లలేమో తల్లడిల్లే ప్రేమ లేని కానలో

20, మార్చి 2022, ఆదివారం

Letha Manasulu : Andaala oh chilakaa Song Lyrics (అందాల ఓ చిలకా)

చిత్రం: లేత మనసులు (1966)

సాహిత్యం: దాశరథి

గానం: పి.బి.శ్రీనివాస్,పి. సుశీల


సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్



పల్లవి : అందాల ఓ చిలకా అందుకో నా లేఖ నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా అందాల చెలికాడా అందుకో నా లేఖ నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను చరణం : 1 మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని కురుల మోముపై వాలెనేలనో విరులు కురులలో నవ్వెనెందుకో అడుగుతడబడే చిలకకేలనో పెదవి వణికెను చెలియకెందుకో అందాల ఓ చిలకా అందుకో నా లేఖ నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా చరణం : 2 మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి కురుల మోముపై మరులు గొనెనులే విరులు కురులలో సిరులు నింపెలే అడుగుతడబడి సిగ్గు బరువుతో పెదవి వణికెలే వలపు పిలుపుతో అందాల చెలికాడా అందుకో నా లేఖ నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను అందాల ఓ చిలకా అందుకో నా లేఖ నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా చరణం : 3 నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి ప్రణయ పాఠము వయసు నేర్పులే మధుర మార్గము మనసు చూపులే నీవు పాడగా నేను ఆడగా యుగము క్షణముగా గడచిపోవుగా అందాల ఓ చిలకా అందుకో నా లేఖ నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

28, జనవరి 2022, శుక్రవారం

Letha Manasulu : Pillalu Devudu Challani Vare Song Lyrics (పిల్లలు దేవుడు చల్లనివారే)

చిత్రం: లేత మనసులు (1966)
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్




పల్లవి : పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే చరణం : 1 పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును ఆ పురుటికందు మనసులో దైవముండును ఆ పురుటికందు మనసులో దైవముండును వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే అంత మనిషిలో దేవుడే మాయమగునులే అంత మనిషిలో దేవుడే మాయమగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే చరణం : 2 వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే చరణం : 3 పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు మాయమర్మమేమి లేని బాలలందరు మాయమర్మమేమి లేని బాలలందరు ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే