చిత్రం :మాతృదేవత(1969)
గాయని : పి.సుశీల, బి.వసంత
రచయిత : సి.నారాయణ రెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్
మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ
మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ
చరణం : 1
ఒక అన్నకు ముద్దులచెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక అన్నకు ముద్దులచెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక రామయ్యనే కన్నతల్లి
ఒక రామయ్యనే కన్నతల్లి సకలావనికే కల్పవల్లి... ఆ... ఓ...
మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ
చరణం : 2
సీతగా ధరణిజాతగా సహన శీలం చాటినది రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది॥ మొల్లగా కవితలల్లగా తేనెజల్లు కురిసినది మొల్లగా కవితలల్లగా తేనెజల్లు కురిసినది లక్ష్మిగా ఝాన్సీలక్ష్మిగా సమర రంగాన దూకినది
సమర రంగాన దూకినది
మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ
చరణం : 3 తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరయును ముత్యాలసరులు కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవురా సిరులు కన్నకడుపున చిచ్చురగిలెనా కరువులపాలౌను దేశం
కన్నకడుపున చిచ్చురగిలెనా కరువులపాలౌను దేశం తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం
తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం
మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ
తరగని పెన్నిధి మగువ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి