చిత్రం: ప్రేమ నగర్(1971)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల,పి. సుశీల
సంగీతం: కె. వి. మహదేవన్
కడవెత్తుకొచ్చింది కన్నె పిల్లా అది కనపడితే చాలు నా గుండె గుల్ల కడవెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నాకొళ్ళు తెలవదు పిక్కల పైదాకా చుక్కల చీర కట్టి పిడికిడంత నడుము చుట్టూ పైట కొంగు బిగగట్టి వెళుతుంటే చూడాలి వెళుతుంటే చూడాలి దాని నడక అబ్బో ఎర్రెత్తిపోవాలి దాని ఎనక చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు బిరుసైన కండరాలు బిరుసైన కండరాలు మెరిసేటి కళ్ళ డాలు వస్తుంటే చూడాలి వస్తుంటే చూడాలి వాడి సోకు ఆడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు తలపాగా బాగ చుట్టి ములుకోలు చేతబట్టి అరకదిమి పట్టుకుని మెరక చేనులో వాడు దున్నుతుంటే చూడాలి దున్నుతుంటే చూడాలి వాడి జోరు వాడు తోడుంటే తీరుతుంది వయసు పోరు నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతూ వొంగింది చిన్నది ఒంపులన్ని వున్నది చూస్తుంటే చాలు దాని సోకు మాడ పడి చస్తాను వస్తానంటే కాళ్ళ కాడ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి