Prema Nagar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Prema Nagar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మార్చి 2022, శుక్రవారం

Prema Nagar : Kadavettu Kochindi Kannepilla Song Lyrics (కడవెత్తుకొచ్చింది కన్నె పిల్లా)

 చిత్రం: ప్రేమ నగర్(1971)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల,పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్ 



కడవెత్తుకొచ్చింది కన్నె పిల్లా అది కనపడితే చాలు నా గుండె గుల్ల కడవెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నాకొళ్ళు తెలవదు పిక్కల పైదాకా చుక్కల చీర కట్టి పిడికిడంత నడుము చుట్టూ పైట కొంగు బిగగట్టి వెళుతుంటే చూడాలి వెళుతుంటే చూడాలి దాని నడక అబ్బో ఎర్రెత్తిపోవాలి దాని ఎనక చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు బిరుసైన కండరాలు బిరుసైన కండరాలు మెరిసేటి కళ్ళ డాలు వస్తుంటే చూడాలి వస్తుంటే చూడాలి వాడి సోకు ఆడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు తలపాగా బాగ చుట్టి ములుకోలు చేతబట్టి అరకదిమి పట్టుకుని మెరక చేనులో వాడు దున్నుతుంటే చూడాలి దున్నుతుంటే చూడాలి వాడి జోరు వాడు తోడుంటే తీరుతుంది వయసు పోరు నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతూ వొంగింది చిన్నది ఒంపులన్ని వున్నది చూస్తుంటే చాలు దాని సోకు మాడ పడి చస్తాను వస్తానంటే కాళ్ళ కాడ

16, జనవరి 2022, ఆదివారం

Prema Nagar : Nee Kosam Velasindhi Song Lyrics (నీ కోసం వెలిసిందీ...)

చిత్రం: ప్రేమ నగర్(1971)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల,పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్ 


నీ ...కోసం... ఆ.ఆ.ఆ.ఆ... నీ ...కోసం ...ఆ.ఆ.ఆ.ఆ... నీ కోసం వెలిసిందీ... ప్రేమ మందిరం నీ కోసం విరిసిందీ హృదయనందనం ||2|| నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం. ప్రతి పువ్వూ నీ నవ్వే నేర్చుకున్నదీ. ప్రతి తీగ నీ ఒంపులు తెచ్చుకున్నదీ. ప్రతి పాదున నీ మమతే పండుతున్నదీ. ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నదీ. నీ కోసం విరిసిందీ... హృదయ నందనం... నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం... ఆ...ఆ... ఆ... అలుపు రాని వలపులు... ఆహహహా ఆడుకునేదిక్కడ... ఆ అ అ ఆ చెప్పలేని తలపులు ...అహహహా... చేతలయేదిక్కడ... ఆఆ ...ఆఆఅ విడిపోని బంధాలు వేసుకునేదిక్కడ తొలి చెలిమీ అనుభవాలు, తుది చూసేదిక్కడ. ఆ ఆఆఅ... ...ఓ ఒఒఒ.ఓ... ...ఆహహహాహ ...ఆఆఆ. నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం. కలలెరుగని మనసుకు అహహహా... కన్నెరికం చేశావు. ఆఆ... శిలవంటి మనిషిని. అహహహా. శిల్పంగా మార్చావు ఆఆఅ. తెరువని నా గుడి తెరిచీ... దేవివై వెలిశావు. నువు మలచిన ఈ బ్రతుకూ, నీకే నైవేద్యం... ఆఆఆఆఅ.ఆఆఆ అ ఓఒఓఒ.ఒ. ఒ ఒ అహహహహాహ... ఆ. అ అ అ అ ఆ ... నీకోసం వెలిసిందీ, ప్రేమ మందిరం. నీ కోసం... విరిసిందీ... హృదయ నందనం... నీ కోసం వెలిసిందీ... ప్రేమ మందిరం. నీ ...కోసం... నీ ...కోసం...

Prema Nagar : Vunte Ee Oollo Vundu song Lyrics (ఉంటే ఈ ఊళ్ళో)

చిత్రం: ప్రేమ నగర్(1971)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్


పల్లవి : ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా చుట్టుపక్కల ఉన్నావంటే.. చూడకుండా ప్రాణ ముండదురా..ఆ ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా చరణం 1 : కూలికెళ్తే నాకే రారా.. చేను వున్నాది కూడు తింటే నాతో తినరా.. తోడువుంటాది కూలికెళ్తే నాకే రారా.. చేను ఉన్నాది కూడు తింటే నాతో తినరా.. తోడువుంటాది ఇంకేడకైనా ఎల్లావంటే..ఏ.. ఏ..ఇంకేడకైనా ఎల్లావంటే నాది చుప్పనాతి మనసు.. అది నీకు తెలుసు నాది చుప్పనాతి మనసు.. అది నీకు తెలుసు ఒప్పి వూరుకోనంటది ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా చరణం 2 : ఊరినిండా వయసు పిల్లలు.. ఒంటిగున్నారు వాటమైనవాడ్ని చూస్తే.. వదలనంటారు ఊరినిండా వయసు పిల్లలు.. ఒంటిగున్నారు వాటమైనవాడ్ని చూస్తే.. వదలనంటారు నీ చపల బుద్ది సూపావంటే..ఏ... ఏ.. మనిషి నాకు దక్కవింక.. మంచిదాన్ని కాను ఆనక ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా చరణం 3 : పగటిపూట పనిలో పడితే.. పలకనంటావు రాతిరేళ రహస్యంగా.. రాను జడిసేవు పగటిపూట పనిలో పడితే.. పలకనంటావు రాతిరేళ రహస్యంగా.. రాను జడిసేవు నే తెల్లవార్లు మేలుకుంటే.. నే తెల్లవార్లు మేలుకుంటే ఎఱ్ఱబడ్డ కళ్ళు చూసి.. ఏమేమో అనుకొని ఎఱ్ఱబడ్డ కళ్ళు చూసి.. ఏమేమో అనుకొని ఈది ఈది.. కుళ్ళుకుంటాది ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా చుట్టుపక్కల ఉన్నావంటే.. చూడకుండా ప్రాణ ముండదురా..ఆ ఉంటే ఈ ఊళ్ళో ఉండు.. పోతే మీ దేశం పోరా

Prema Nagar : Theta Theta Telugula Song Lyrics (తేట తేట తెలుగులా)

చిత్రం: ప్రేమ నగర్(1971)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల

సంగీతం: కె. వి. మహదేవన్




తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా _ సెలయేరులా కలకలా _ గలగలా కదిలి వచ్చింది _ కన్నె అప్సర వచ్చి నిలిచింది _ కనుల ముందర... తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా _ సెలయేరులా కలకలా _ గలగలా కదిలి వచ్చింది _ కన్నె అప్సర వచ్చి నిలిచింది _ కనుల ముందర... తెలుగు వారి ఆడ పడుచు ఎంకిలా _ ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా తెలుగు వారి ఆడ పడుచు ఎంకిలా _ ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా గోదారి కెరటాల గీతాల వలె నాలో పలికినది _ పలికినది _ పలికినది... చల్లగా _ చిరుజల్లుగా జలజలా గలగలా.... కదిలి వచ్చింది _ కన్నె అప్సర వచ్చి నిలిచింది _ కనుల ముందర... తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా రెక్కలొచ్చి వూహలన్ని ఎగురుతున్నవి ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి రెక్కలొచ్చి వూహలన్ని ఎగురుతున్నవి ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి లో లోన నా లోన ఎన్నెన్నో రూపాలు వెలిసినవి...వెలిసినవి... వెలిసినవి... వీణలా _ నెరజాణలా... కలకలా _ గల గలా.. కదిలి వచ్చింది _ కన్నె అప్సర వచ్చి నిలిచింది _ కనుల ముందర... తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా

1, ఆగస్టు 2021, ఆదివారం

Prema Nagar : Manasu Gathi Inthe Song Lyrics (మనసు గతి ఇంతే )

చిత్రం: ప్రేమ నగర్ (1971 )

సంగీతం: కేవీ మహదేవన్

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల


మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచి పోదు గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకు పడదు మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో మనిషికి మనసే తీరని శిక్షా... దేవుడిలా తీర్చుకున్నాడు కక్