చిత్రం: శ్రీ రామ రాజ్యం (2011)
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఇళయరాజా
గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ నేరం చేసిందెవరూ దూరం అవుతుందెవరూ ఘోరం ఆపేదెవరు ఎవరూ రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా కొండ కోన అడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ ముక్కోటి దేవతలంత దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కడు కూడా దిగిరార అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగ పోలేద ఈ రథముని ఆపగలేద విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ అక్కడితో అయిపోకుండ ఇక్కడ ఆ ఇల్లాలే రక్కసివిధి కి చిక్కిందా ఈ లెక్కన దైవం ఉందా సుగునంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలిసిందా ఈ జగమే చీకటి అయ్యిందా ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేరా ఎవరైనా కానీ నీ మాట నీదా వేరే దారేదీ లేదా నేరం చేసిందెవరూ దూరం అవుతుందెవరూ ఘోరం ఆపేదెవరు ఎవరూ రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేర ఒకరూ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి