చిత్రం: శ్రీ తిరుపతమ్మ కథ (1963)
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: పి.లీల
సంగీతం: పామర్తి, బి. శంకర్
ఆఆఆ....ఆఆఆ.....ఆఆఆఆఆ ఆఆఆ...ఆఆఆఆ శ్రీ వేంకటేశ దయాసాగరా శ్రీ వెంకటేశ శ్రీ వేంకటేశ దయాసాగరా శ్రీ వెంకటేశ ఎక్కడో దూరాన ఏడు కొండల మీద ఎక్కడో దూరాన ఏడు కొండల మీద ఎక్కి కూర్చొని ప్రజల మొక్కులందేవాడ ఇక్కడే మా ఇంట వెలసినావయ్యా నా హృదయ తీరాన నిలచినావయ్యా శ్రీ వేంకటేశ దయాసాగరా శ్రీ వేంకటేశా... మనసె తిరుపతి కొండ మాకు నీవే అండ మనసె తిరుపతి కొండ మాకు నీవే అండ కనులలో నీ పాద కమలాలు నిండా నిన్ను భావించేము నిన్ను కొలిచేము ఆదుకో రమ్మని నిన్ను పిలిచేము శ్రీ వేంకటేశ దయాసాగరా శ్రీ వేంకటేశా దేవతల కందరికి దేవుడవు నీవు దేవతల కందరికి దేవుడవు నీవు తలచినంతనే కనుల మెదులుతుంటావు పిలిచినంతనే బదులు పలుకుతుంటావు నన్ను నీ దాసిగా పాలించ వయ్యా శ్రీ వేంకటేశ దయాసాగరా శ్రీ వేంకటేశా....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి