చిత్రం : స్వర్ణ మంజరి (1962)
గాయని : ఘంటసాల, పి. సుశీల
రచయిత : సముద్రాల రాఘవాచార్య
సంగీతం : పి. ఆదినారాయణరావు
పల్లవి: ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. మధురమైన గురు దీవెనా.. మరపు రాని ప్రియ భావనా కనుమా కొనుమా రాజా..ఆ.. కనుమా కొనుమా రాజా కలలోలేని కలగాలేని.. నవరాగ మాల మధురమైన గురుదీవెనా..ఆ.. మరపురాని ప్రియభావనా చరణం 1: సరస సంగీత సాహిత్య సీమా.. మాకు సరి మేమిగామా..ఆ.. మాకు సరి మేమిగామా.. తియ్యనైనా నా పాటవిన్నా.. రాళ్ళు కరగి నీరౌనుగా కలలోలేని కలగాలేని.. నవరాగమాల మధురమైన గురుదీవెనా..ఆ.. మరపురాని ప్రియభావనా చరణం 2: లలిత నాట్యాల మా సాటివారు.. ఇలను లేనే లేరు..ఊ.. ఇలను లేనే లేరు.. కాలి మువ్వ ఘల్ ఘల్లుమనగా.. రసిక హృదయాలు ఝల్ ఝల్లను కలలోలేని కలగాలేని.. నవరాగ మాల మధురమైన గురుదీవెనా..ఆ.. మరపురాని ప్రియభావనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి