24, మార్చి 2022, గురువారం

Khaidi Kannaiah : Tiya Teeyani tenela matalato Song Lyrics (తియ్య తియ్యని తేనెల )

చిత్రం : ఖైదీ కన్నయ్య (1956)

గాయని : ఆర్.రాజశ్రీ, పి. సుశీల

రచయిత : జి. కృష్ణమూర్తి

సంగీతం : రాజన్–నాగేంద్ర

 


తియ్య తియ్యని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా మానవద్దు తియ్య తియ్యని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు దొంగల చేతికి దొరకనిది దానము చేసిన తరగనిదీ దొంగల చేతికి దొరకనిది దానము చేసిన తరగనిదీ పదుగురిలోన పరువుని పెంచి పేరును తెచ్చే పెన్నిదది తియ్య తియ్యని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు

అల్లరి చేయుట చెల్లనిది ఎల్లప్పుడాడుట కూడనిది అల్లరి చేయుట చెల్లనిది ఎల్లప్పుడాడుట కూడనిది ఎడువరాదు ఎమరరాదు వీరునివలె నీవు నిలవాలి తియ్య తియ్యని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు బ్రతుకనె బాటను కడదాక నడచే పోవలే వంటరిగా బ్రతుకనె బాటను కడదాక నడచే పోవలే వంటరిగా ఇడుములు రాని పిడుగులు పడని నీ అడుగుల వడి తడబడునా తియ్య తియ్యని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా మానవద్దు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి