చిత్రం: ఉమ్మడి కుటుంబం (1967)
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి. సుశీల
సంగీతం: టి. వి. రాజు
చెప్పాలని ఉంది . చెప్పాలని ఉంది .దేవతయే దిగివచ్చి మనుషులలో కలసిన కధ చెప్పాలని ఉంది పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్నుతట్టి పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్ను తట్టి మనిషిగ తీరిచి దిద్దిన మరువరాని దేవత కధ . చెప్పాలని ఉంది! కోరనిదే వరాలిచ్చి . కొండంత వెలుగు నిచ్చి కోరనిదే వరాలిచ్చి . కొండంత వెలుగు నిచ్చి మట్టిని మణిగా చేసిన మమతెరిగిన దేవత కధ . చెప్పాలని ఉంది! అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో! అంతటి దేవికి నా పై ఇంతటి దయ ఏలనో . ఎన్ని జన్మలకు ఈ ఋణమెలా ఎలా తీరునో నీ చల్లని మదిలో ఆ దేవికింత చోటిస్తే ... నీ చల్లని మదిలో అ దేవికింత చోటిస్తే . ఆ లోకమె మరచి పోవు నీ లోనే నిలిచిపోవు ఆ .ఆ.ఆ.ఆ.ఆ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి