చిత్రం: అబ్బాయిగారు (1993)
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
వెన్నెలకి ఎం తెలుసూ హొయ్ మల్లెలకి ఎం తెలుసూ హొయ్ సొగసరి చిన్నదాని చూపులోని చందనాలు చిరు చిరు నవ్వులోని చిందులేయ సోయగాలు ఊరించే వయ్యారాలు చుక్కలకి ఎం తెలుసూ హొయ్ దిక్కులకి ఎం తెలుసూ హొయ్ గడసరి కుర్రవాడి కొంటె కొంటె విన్నపాలు బిగిచిన కౌగిలింత దాచుకున్న తాయిలాలు తనువిచ్చే తాంబూలాలు... వెన్నెలకి ఎం తెలుసూ చుక్కలకి ఎం తెలుసూ పదే పదే తుళ్ళింది యదే నదై పొంగింది తెలీయని ఓ హాయిలో అదో ఇదై పోతుంది ఎదో ఎదో ఇమ్మంది మతే చెడే ఈ వేళలో వినమన్నా... వినదే ఈ మనసూ వలదన్నా... విడదు లే వయసూ తెలియక ప్రేమలోన చిక్కుకున్న చిన్నదాన్ని తడబడు కన్నె సోకు కోరుకున్నకుర్రవాడ్ని కలిపింది ఏ రాగమో... వెన్నెలకి ఎం తెలుసూ హోయ్ చుక్కలకి ఎం తెలుసూ హొయ్ హొయ్ నిరంతరం నీ అందం మధించని ఆనందం పెదవుల సయ్యాటలో నరం నరం నర్తించే సుఖస్వరం ఈ బంధం తరించని సందిళ్ళలో ఒడిలోనే... పడనా సరదాలు అడగాలా... పరిచా పరువాలు తొలి తొలి ముద్దులోనే తీపి తీపి అనుభవాలు మలి మలి హద్దులన్ని రద్దుచేయు ఆయుధాలు ఉప్పొంగే ఉల్లాసాలు... వెన్నెలకి ఎం తెలుసూ హొయ్ హొయ్ హొయ్ హొయ్ చుక్కలకి ఎం తెలుసూ హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి