చిత్రం: అబ్బాయిగారు (1993)
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ చల్లంగ చూడవమ్మా దిక్కే నువ్వై రావమ్మ మొక్కే దైవం నీవమ్మ దీవించి ఏలవమ్మా వెన్నంటి మనుసున్న తల్లి పాలవెల్లివే వెన్నంటి కాపాడగ వచ్చినావే తల్లిదండ్రి నువ్వేనమ్మ తోడునీడ నువ్వేనమ్మ నీనోటి మాటంటే శాసనం అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ చల్లంగ చూడవమ్మా దిక్కే నువ్వై రావమ్మ మొక్కే దైవం నీవమ్మ దీవించి ఏలవమ్మా జగమే మరపింప జేయునది కన్నతల్లి ప్రేమ శిశువైనా పశువైనా తన తల్లి ఒడికే పరుగులు తీయునులే జననీ అను మాటలోనే తరియించు మనిషి జన్మ ఇలనైనా కలనైనా ఆ అమ్మ ఋణమే ఎన్నడు తీరదులే ప్రాణం నా ధ్యానం మా అమ్మ కోసమని ఉన్నా బ్రతికున్నా మా అమ్మే లోకమని బ్రహ్మైనా అమ్మంటే చాలు మొక్కుతాడురా ప్రాణంగా చూసేది ఆ పాశమేరా దేవుడ్నయినా ఎదిరిస్తారు కాలాన్నైనా శాసిస్తారు అమ్ముంటే చాలంట అండగా అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ చల్లంగ చూడవమ్మా దిక్కే నువ్వై రావమ్మ మొక్కే దైవం నీవమ్మ దీవించి ఏలవమ్మ అమ్మా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి