7, ఏప్రిల్ 2022, గురువారం

Bandipotu : Vagala Ranivi Neeve Song Lyrics (వగలరాణివి నీవె )

చిత్రం: బందిపోటు (1963)

సంగీతం: ఘంటసాల

రచన: సి. నారాయణ రెడ్డి

గానం: ఘంటసాల



ఓహోహో ఓ ఓ ఓహోహో ఓ ఓ  ఓహోహోహో ఓ ఓ  వగలరాణివి నీవె సొగసు కాడను నేనె ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే వగల రాణివి నీవె సొగసు కాడను నేనె ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే వగల రాణివి నీవే  పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం వగల రాణివి నీవె ఓహోహో ఓ  ఒహోహో ఓ ఒహోహో ఓ ఓ  ఓహోహొ ఓఓఓ ఓహోహొ ఓఓఓ దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన వగల రాణివి నీవె  కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె వగలరాణివి నీవె సొగసు కాడను నేనె ఈడు కుదిరెను జోడు కుదిరెను తోడుగా రావే  వగల రాణివి నీవె ఓహోహో ఓ  ఓహోహో ఓ ఓహోహో ఓఓఓ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి