చిత్రం: ఘరానా బుల్లోడు(1995)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
రచన: వేటూరి
గానం: మనో, కె.యస్.చిత్ర
పల్లవి: చుక్కల్లో తళుకులా..........ఓ.....ఓహో..... దిక్కుల చలి వెలుగులా...ఓ.....ఓహో...... పొద్దుల్లో ఎరుపులా..........ఓ.....ఓహో..... మబ్బుల తొలి మెరుపులా....ఓ....ఓహో.... నింగి నుంచి తొంగి చూసి నచ్చగానే నిచ్చెనేసి జర్రుమంటూ జారింది..... మబ్బుల్లో జాబిల్లి..........ఓ.....ఓహో..... జాజుల్లో నా మల్లి........ఓ.....ఓహో..... మబ్బుల్లో జాబిల్లి........❤️❤️❤️........ చుక్కల్లో తళుకులా..........ఓ.....ఓహో..... దిక్కుల చలి వెలుగులా...ఓ.....ఓహో...... చరణం:1 మల్లెపూల చెల్లెలా నవ్వుపూల జల్లులా మిలమిల సోకులే మీటనివ్వు నన్ను లేతగా కొంగు చాటు ముంతలా పొంగు పాలపుంతలా గిలగిల గిల్లకా రేతిరేసెయ్ రెండు చెంపలా నిబ్బరాల నిమ్మపండు ఒలిచి పెట్టవా ఓ....ఓహో....ఓహోహోహోహోహో......... కొబ్బరంటి కొత్త ఈడు కొలిచి పెట్టవా ఓ....ఓహో....ఓహోహోహోహోహో......... ఏకాదశి నా ఊర్వశి శ్రీ రమ్య శృంగార రాశి త్రయోదశి జాబిల్లికి ఈనాడే పున్నమి సిగ్గమ్మా...❤️❤️ఛీ....ఛీ....ఛీ....❤️❤️❤️❤️ చుక్కల్లో తళుకులా..........ఓ.....ఓహో..... దిక్కుల చలి వెలుగులా...ఓ.....ఓహో...... పొద్దుల్లో ఎరుపులా..........ఓ.....ఓహో..... మబ్బుల తొలి మెరుపులా....ఓ....ఓహో.... చరణం:2 నింగి నేల ఒడ్డునా చందమామ బొడ్డునా తళతళ తారలే తాకిపోయే నన్ను మెత్తగా రాజహంస రెక్కలా రాసలీల పక్కలా గుసగుస గువ్వలా గూడు కట్టుకోవే మత్తుగా పిక్కటిల్లిపోతే ఈడు పైట నిలుచునా ఓ....ఓహో....ఓహోహోహోహోహో......... పిక్కలాగు పిల్లదాని నడుము పలచనా ఓ....ఓహో....ఓహోహోహోహోహో......... మహాశయా నా మన్మథా మందార సందిళ్లో రారా సఖి ప్రియా సాగే లయా నా ప్రేమ తొందర చీకట్లో చిందేసి...❤️❤️❤️❤️❤️❤️ చుక్కల్లో తళుకులా..........ఓ.....ఓహో..... దిక్కుల చలి వెలుగులా...ఓ.....ఓహో...... పొద్దుల్లో ఎరుపులా..........ఓ.....ఓహో..... మబ్బుల తొలి మెరుపులా....ఓ....ఓహో.... నింగి నుంచి తొంగి చూసి నచ్చగానే నిచ్చెనేసి జర్రుమంటూ జారింది..... మబ్బుల్లో జాబిల్లి..........ఓ.....ఓహో..... జాజుల్లో నా మల్లి........ఓ.....ఓహో..... మబ్బుల్లో జాబిల్లి........❤️❤️❤️........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి