చిత్రం : ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : చంద్రబోస్
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్
మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా ప్రియతమ పదవందిస్తే ఆ పుడమిని ఎదురిస్తా దా దా దా దా ఆ.... పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా చరణం : 1
కళ్ళతోటి కావలిస్తే కాళిదాసు నవలిస్తా ఎదకు ఎదురు పడితే ఆ... పెదవి పొదిగి పెడతా కొంగుముడి చేరువొస్తే కోహినూరు కొసరిస్తా నడక మిడిసి పడితే ఓ... నడుము మడత ముడతా కృష్ణయ్యలా వెన్నంటితే నా సన్ననీ చెల్లించునా వనితా విను చెబుతా కథ ఆ.... మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా చరణం : 2
రాజులాగ రాజుకుంటే వైజయంతిమాలేస్తా గడియ గడువు పెడితే ఆ... తడిసి కడివెడవుతా సాగరంలా కమ్ముకుంటే బ్రహ్మపుత్ర నదినిస్తా కలసి మెలసి పోతే ఓ... మెరిసి కురిసి వెళతా వాల్మీకిలా వేటాడితే ప్రేమాయణం వర్ణించుతా లలితా ముడిపడతా పద ఆ.... మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా ప్రియుతమ పదవందిస్తే ఆ పుడమిని ఎదురిస్తా జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా రా రా నాదా... ఓ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి