Iddaru Mithrulu (1999) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Iddaru Mithrulu (1999) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, నవంబర్ 2024, శుక్రవారం

Iddaru Mithrulu : Nuttokka Jillalaku Song Lyrics (నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంట్ట అమ్మాయి )

చిత్రం : ఇద్దరు మిత్రులు (1999)

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

రచన : చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్





హేహేహేరబ్బ

నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంట్ట అమ్మాయి

నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంట్ట అమ్మాయి

నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంట్ట అమ్మాయి ఒట్టేసి చెప్పాలా తనుంటుంది గులాబీలా

ఒట్టేసి చెప్పాలా తనుంటుంది గులాబీలా మనిషే మరీ భోళాగా తనమాటే గలగలా తానేలేని వీణా ఆ ప్రాణం విలవిల

నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంట్ట అమ్మాయి

నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంట్ట అమ్మాయి

చరణం : 1

గాలేనువ్వైతే తెరచాపల్లే నిలబడతా జోలాలేనువ్వైతే పసిపాపల్లే నిదరోతా రాణిలాగా కోరితే బంటులాగా వాలనా భక్తితోటివేడితే దేవతల్లే చూడనా సన్నాయి సవ్వడల్లే సంక్రాంతి సందడల్లే రోజంతా సరిక్రొత్త కేరింతలే మలినాలేవి లేని మధుగీతం మనదిలే ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి

ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి చరణం : 2

మూగై నువ్వుంటే చిరునవ్వుల్లో ముంచేస్తా నువ్వు మోడలై నిలుచుంటే చిగురించేలా మంత్రిస్తా కోపమొచ్చినప్పుడు బుజ్జగించవే మేనకా కొంటెవేష మేసినప్పుడు వెక్కిరింత నాదట చప్పట్లు కొద్దిసేపు చివాట్లు కొద్దిసేపు మనమధ్య వుంటాయి పోతాయిలే ఆనందాన్ని యేలే అధికారం మనదిలే

ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి

ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి

చూస్తాడు సింహంలా చిందేస్తాడు ప్రవాహంలా

చూస్తాడు సింహంలా చిందేస్తాడు ప్రవాహంలా

మనసే మేఘమాలా తన ఉనికే వెన్నెలా తానే లేనినేలా పోతుంది విలవిలా

నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంట్ట అమ్మాయి

నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంట్ట అమ్మాయి


25, ఏప్రిల్ 2022, సోమవారం

Iddaru Mithrulu : Manasa Vacha Song Lyrics (మనసా వాచా మనసిస్తే...)

చిత్రం : ఇద్దరు మిత్రులు (1999)

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

రచన : చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్



మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా ప్రియతమ పదవందిస్తే ఆ పుడమిని ఎదురిస్తా దా దా దా దా ఆ.... పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా చరణం : 1

కళ్ళతోటి కావలిస్తే కాళిదాసు నవలిస్తా ఎదకు ఎదురు పడితే ఆ... పెదవి పొదిగి పెడతా కొంగుముడి చేరువొస్తే కోహినూరు కొసరిస్తా నడక మిడిసి పడితే ఓ... నడుము మడత ముడతా కృష్ణయ్యలా వెన్నంటితే నా సన్ననీ చెల్లించునా వనితా విను చెబుతా కథ ఆ.... మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా చరణం : 2

రాజులాగ రాజుకుంటే వైజయంతిమాలేస్తా గడియ గడువు పెడితే ఆ... తడిసి కడివెడవుతా సాగరంలా కమ్ముకుంటే బ్రహ్మపుత్ర నదినిస్తా కలసి మెలసి పోతే ఓ... మెరిసి కురిసి వెళతా వాల్మీకిలా వేటాడితే ప్రేమాయణం వర్ణించుతా లలితా ముడిపడతా పద ఆ.... మనసా వాచా మనసిస్తే... మైసూర్ ప్యాలెస్ రాసిస్తా పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలెస్ చదివిస్తా ప్రియుతమ పదవందిస్తే ఆ పుడమిని ఎదురిస్తా జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా రా రా నాదా... ఓ...

9, ఏప్రిల్ 2022, శనివారం

Iddaru Mithrulu : Bangaram Techi Song Lrycis (బంగారం తెచ్చి )

 

చిత్రం : ఇద్దరు మిత్రులు (1999) సంగీతం : ఎం.ఎం.కీరవాణి రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : పార్థసారధి , కె.యస్.చిత్ర




పల్లవి : బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ.. బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ.. ఎన్నాళ్ళనుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఈ బొమ్మ చెంత చెదరని మురిపించే చిత్రం చూడనీ వీరివీరి గుమ్మాడీ వాడీ పేరేంటమ్మా అమ్మాయి ఓ . . .

బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ.. బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ..

చరణం : 1

జో . . . లాలి అని కొత్తరాగాలెన్నో పలుకమ్మా తీయగా ఈ . . . మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనే పాట అమ్మాయిగారు అమ్మగా పదవిని - పొందునట ఇల్లంతా బొమ్మల కొలువు మనసంత నవ్వుల నిలవుఓ |

బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ.. బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ..

చరణం : 2

అడగక ముందే అన్నీ చేసి సేవకుడవి అనిపిస్తావు అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు ఈ జన్మలోను నే తీర్చలేని రుణమై బంధించావు నీ స్నేహంతోనే చిగురించమని వరమే - అందించావు ఎప్పుడూ నా కళ్ళు చూడనీ వెలుగే చూపించినావు ఎప్పుడు నా గుండెపాడనీ మధురీమ నేర్పావు నీలికళ్ళే చిందే తడిలో హరివిల్లే రాని త్వరలో ఓ . . . ఓ . . .మాతృత్వానికి మగరూపానివై నాన్నతనంలో కర్ణుడివై అన్నగుణంలో కృష్ణుడివై బతుకంతా జతగా నిలిచే విధివో పతినే మించిన తోడువై బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా