14, ఏప్రిల్ 2022, గురువారం

Jagadeka Veerudu Atiloka Sundari : Andalalo Aho Mahodayam Song Lyrics (అందాలలో అహో మహోదయం)

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం:ఇళయరాజా



పల్లవి: లా లా ల ల ల లా లా లా ల ల ల లా అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వూ నవ్వూ పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో తారల్లారా రారే విహారమే అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం చరణం 1: లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడీ వరించెలే సరాలతో మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా తళా తళా గళాన తటిల్లతా హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో ||అందాలలో|| చరణం 2: సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా విహారినై ఇవాళే దివి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి