Jagadeka Veerudu Atiloka Sundari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jagadeka Veerudu Atiloka Sundari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, జనవరి 2024, శనివారం

Jagadeka veerudu Atiloka Sundari : Dhinakkuta Song Lyrics (ధినక్కుతా కసక్కురో)

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం:ఇళయరాజా




పల్లవి: ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా ఢమక్కురో తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో

చరణం 1: కసక్కు లయలు హొయలు చూశా కసెక్కి వలపు వలలే వేశా గుబుక్కు ఎదలో కథలే దాచా గుటుక్కు మనక గుబులే దోచా మజా చేస్తే మరోటంట మరోటిస్తే మగాణ్ణంట సరే అంటే అతుక్కుంటా సరాగంలో ఇరుక్కుంటా చుంబురుణ్ణై.. నారదుణ్ణై.. చుంబ మీద పంబ రేపి పాడుతుంటే మీరు గోవిందే గోవిందా గోవింద come on.. come on పాడండయ్యా పబం పప్పా పబం పప్పా పబం పప్పా పబం పప్పా పబం పం పాబం పపం పం పాబం పబం పం పాబా పాబా బాబాబం ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో

చరణం 2: వయస్సు ఒడిలో చొడినే చూశా వరించి సుడిలో పడవే వేశా నటించే నరుడా ఘనుడా మెచ్చా నమస్తే నడుమే నటిగా ఇచ్చా ఉడాయిస్తే ఉడుక్కుంటా లడాయొస్తే హోయ్ ఉతుక్కుంటా సఖి అంటే సరే అంటా చెలి అంటే గురు అంటా బ్రేకు డ్యాన్సు.. షేకు డ్యాన్సు.. mix చేసి steps వేసి tricks చేస్తే మీరు గోవింద come on..come on dance I say ఆడండ్రా ధినక్కుతా ధినక్కుతా ధినక్కుతా ధినక్కుతా ధినక్కు తార ధినక్కు తార ధినక్కు తారా తారా తారారా ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురోయ్

14, ఏప్రిల్ 2022, గురువారం

Jagadeka Veerudu Atiloka Sundari : Andalalo Aho Mahodayam Song Lyrics (అందాలలో అహో మహోదయం)

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం:ఇళయరాజా



పల్లవి: లా లా ల ల ల లా లా లా ల ల ల లా అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వూ నవ్వూ పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో తారల్లారా రారే విహారమే అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం చరణం 1: లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడీ వరించెలే సరాలతో మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా తళా తళా గళాన తటిల్లతా హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో ||అందాలలో|| చరణం 2: సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా విహారినై ఇవాళే దివి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం

Jagadeka Veerudu Atiloka Sundari : Yamaho Ni Yama Song Lyrics (యమహో నీ యమ )

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం:ఇళయరాజా



యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం నమహో నీ ఝమ ఝమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం పోజుల్లో నేను యముడంత వాడ్ని మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం నమహో నీ ఝమ ఝమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం నల్లని కాటుక పెట్టి, గాజులు పెట్టి, గజ్జా కట్టి గుట్టుగా సెంటే కొట్టి, వడ్డాణాలే ఒంటికి పెట్టి తెల్లని చీర కట్టి, మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింట దీపమెట్టి, చీకుచింత పక్కానెట్టి నిన్ను నాలో దాచిపెట్టి, నన్ను నీకు దోచిపెట్టి పెట్టూపోతా వద్దే చిట్టెంకి చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళమ్మి, నువ్వు పుట్టింది నాకోసమమ్మి ఇక నీ సొగసు, నా వయసు పేనుకొనే ప్రేమలలో యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం నమహో నీ ఝమ ఝమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం పట్టె మంచమేసి పెట్టి, పాలు పెట్టి, పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి, పక్కా పక్కా నోళ్ళు పెట్టి ఆకులో వక్క పెట్టి, సున్నాలెట్టి, చిలకా చుట్టి ముద్దుగా నోట్లో పెట్టి, పరువాలన్ని పండపెట్టి చీర గుట్టు సారే పెట్టి, సిగ్గులన్నీ ఆరబెట్టి కళ్ళలోన వత్తులెట్టి, కౌగిలింత మాటు పెట్టి ఒట్టే పెట్టి వచ్చేసాక మామ నిను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమ పెట్టెయ్యి సందె సీకట్లోన నను కట్టెయ్యి కౌగిలింతల్లోన ఇక ఆ గొడవ, ఈ చొరవ ఆగవులే అలజడిలో యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం నమహో నీ ఝమ ఝమ వాటం సుడి రేగింది ఎడా పెడా తాళం పోజుల్లో నేను యముడంత వాడ్ని మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం

28, జనవరి 2022, శుక్రవారం

Jagadeka Veerudu Atiloka Sundari : Jai Chiranjeeva Song Lyrics (జై చిరంజీవా)

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)

రచన: వేటూరి

గానం: యస్.పి.శైలజ

సంగీతం:ఇళయరాజా




ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ.. జై చిరంజీవా.. జగదేక వీరా.. జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా దీవించ రావయ్య వాయు సంచారా రక్షించవేలయ్య శ్రీరామ దూత జై చిరంజీవా.. చరణం 1: వీరాంజనేయా శూరాంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభా దివ్యకాయా జై చిరంజీవా.. ఆరోగ్యదాతా అభయ ప్రదాతా..ఆ... ఆరోగ్యదాతా అభయ ప్రదాతా ఉన్మాద భయ జాడ్య పీడా నివారా సంజీవి గిరివాహా.. సానీరిసాహ సంజీవి గిరివాహ సానీరిసాహొ జై చిరంజీవా.. జగదేక వీరా.. జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా జగదేక వీరా

Jagadeka Veerudu Atiloka Sundari : Mana Bharatam Lo Song Lyrics (మన భారతంలో)

చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం:ఇళయరాజా




మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా ఆ రాజు గాధే ఈ రాజు పాట నాపేరే రాజు ఎన్ పేర్ దా రాజు మేరా నాం రాజు మై నేమ్ ఈజ్ రాజు మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా భాయి యో ఔర్ బెహ్ నో ఈ కొండ వీడు వైభవాన్నీ చూసి కన్ను కుట్టిన శత్రు రాజు ధూమ కేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు హా అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపు దాడి చేశాడు విజయుడై వచ్చినాడురా తన ప్రజలంతా మెచ్చినారురా దుర్గమునే ఏలినాడురా ఆ స్వర్గమునే దించినాడురా అక్షితలే చల్లినారు రమణులంతా అహా హారతులే భక్తిమీర పట్టినారురా సింహాసనమెక్కి తాను విష్ణుమూర్తిలా అహ శిరులెన్నో చెలువు మీద చిలికినాడురా ఏ రాజు ఎవరైనా మా రాజువింక నువ్వంటా నీ మనసే మా కోట మీ మాట మాకు పూబాట రాజాధి రాజా మార్తాండ తేజ నాపేరే రాజు మై నేమ్ ఈజ్ రాజు మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా ఆ రాజు గాధే ఈ రాజు పాట నాపేరే రాజు ఎన్ పేర్ దా రాజు మేరా నాం రాజు మై నేమ్ ఈజ్ రాజు రాజు రాజు... అందాల ఆ రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు పెద్ద రాణి నాట్యంలో మయూరి తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం తాం తకిట తదీం తకిట తరకిటతాం తరకిటతాం తరకిటతాం చిన్న రాణి సంగీతంలో దిట్ట సరిగమల పుట్ట పద పద సాస సరి గరి సాపద పద పద సాస సగరిగ సరి గస పద దరి రిగ గస సప గరిస దప గారిస కళలే పోషించినాడురా తను కావ్యాలే రాసినాడురా శిలలే తెప్పించినాడురా ఘన శిల్పాలే మలచినాడురా చెరువులెన్నో తవ్వించి కరువుమాపి అహ అన్నపూర్ణ కోవెలగా చేసినాడురా కులమతాల రక్కసిని రూపుమాపి అహ రామ రాజ్యమన్న పేరు తెచ్చినాడురా నీలాంటి రాజుంటే ఆ దేవుడింక ఎందుకంట చల్లనైన నీ చూపే మాకున్న పండు ఎన్నెలంట రాజాధి రాజా మార్తాండ తేజా నా పేరే రాజు మేరా నాం రాజు మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా ఆ రాజు గాథే ఈ రాజు పాట మమ నామ రాజు ఎన్ పేర్ దా రాజు ఎండ వేరే రాజు నన్న హెసరే రాజు నా పేరే రాజు