7, ఏప్రిల్ 2022, గురువారం

Jwala : Kaliki Chilaka Song Lyrics (కలికి చిలక చలికి)

చిత్రం: జ్వాల (1985)

సంగీతం: ఇళయరాజా

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



M⚘ కలికి చిలక చలికి దరికి చేరగనే చినుకు లిగిరి వలపు రగిలి కోరగనే జానమేన వాన వీణ ఝల్లు మన్నదీ ప్రేమగాలి సోకి నన్ను అల్లుకున్నది

జానమేన వాన వీణ ఝల్లు మన్నదీ ప్రేమగాలి సోకి నన్ను అల్లుకున్నది కౌగిలింతలోనే...హేయ్ హేయ్ కలికి చిలక చలికి దరికి చేరగనే చినుకు లిగిరి వలపు రగిలి కోరగనే F⚘ వానొచ్చి తడిచాక వయసెంతొ తెలిసింది తొలిసారిగా నీవొచ్చి కలిసాక మనసంటె తెలిసింది ఒక లీలగా M⚘ ఆ గాలి వానల్లె కలిసాము యద మంతల్లొ చలి గుళ్ళొ చేరాము మెరుపల్లె ఉరుమల్లె కలిసాము తొలి వయసుల్లొ వడగల్లె ఏరాము F⚘ మనం మనం... మనం మనం భరించడం తరించటం ఇహం పరం M⚘ క్షణం క్షణం నిరిక్షణం సుఖo సుఖం F⚘ కలికి చిలక చలికి దరికి చేరగనే చినుకు లిగిరి వలపు రగిలి కోరగనే మెరుపు తీగ లాంటి మేను మెలిక పడ్డదీ ఉరుముతున్న నిన్ను చూసి ఉలికి పడ్డదీ కౌగిలింతలోనే...హే హే కలికి చిలక చలికి దరికి చేరగనే చినుకు లిగిరి వలపు రగిలి కోరగనే #Veturi🎵 #Ilayaraja🎹 M⚘ వాటెసు కుంటేనె వయసొచ్చె ఈ సంధ్య సధిళ్ళలో.. హో వయ్యరి అందాలు వరదల్లె పొంగేటి కౌగిల్లలో.. హా F⚘ సూరీడు వెళ్ళాక సాయంత్రం తొలి నా ఈడు కోరింది నీ మంత్రం చుక్కల్తొ వచ్చింది ఆకాశం చలి చూపుల్తొ తెచ్చింది ఆవేశం M⚘ ప్రియం ప్రియం... ప్రియం ప్రియం జతి స్వరం పరస్పరం స్వయం వరం F⚘ నరం నరం ఒకే స్వరం నిరంతరం M⚘ కలికి చిలక చలికి దరికి చేరగనే చినుకు లిగిరి వలపు రగిలి కోరగనే జానమేన వాన వీణ ఝల్లు మన్నదీ ప్రేమగాలి సోకి నన్ను అల్లుకున్నది F⚘ మెరుపు తీగ లాంటి మేను మెలిక పడ్డదీ ఉరుముతున్న నిన్ను చూసి ఉలికి పడ్డదీ M⚘ కౌగిలింతలోనే...హే హే కలికి చిలక చలికి దరికి చేరగనే M⚘ వయసు తడిచి వలపు రగిలి కోరగనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి