7, ఏప్రిల్ 2022, గురువారం

Bandipotu : Oohalu Gusagusalade Song Lyrics (ఊహలు గుసగుసలాడే )

చిత్రం: బందిపోటు (1963)

సంగీతం: ఘంటసాల

రచన: ఆరుద్ర

గానం: ఘంటసాల, పి. సుశీల


ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే (2) వలదన్న వినదీ మనసు.. కలనైన నిన్నే తలచు (2) తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే *ననుకోరి చేరిన బేల.. దూరాన నిలిచే వేల నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే *దివి మల్లెపందిరి వేసే.. భువి పెళ్ళిపీటను వేసే (2) నెరవెన్నెల కురిపించుతూ నెలరాజు పెండ్లిని చేసే ఊహలు గుసగుసలాడే మన హృదయములూయలలూగే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి