6, ఏప్రిల్ 2022, బుధవారం

Mudda Mandaram : Aliveni Aanimutyama Song Lyrics (అలివెనీ ఆణిముత్యమా )

చిత్రం: ముద్ద మందారం (1981)

సంగీతం: రమేష్ నాయుడు రచన: వేటూరి. సుందర రామ మూర్తి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి



అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటిముత్యమా ఆవిరి చిగురో.ఇది ఊపిరి కబురో. స్వాతివాన లేత ఎండలో.ఓ.ఓ. జాలి నవ్వూ.ఊ. ఊ. జాజి దండలు అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణముత్యమా జాబిలి చలువో.ఊ. ఊ. ఇది వెన్నెల కొలువో. ఊ. ఊ. స్వాతివాన లేత ఎండలో.ఓ.ఓ.జాజి మల్లీ. పూల గుండెలో.ఓ. ఓ. అలివెనీ ఆణిముత్యమా కుదురైన బొమ్మకీ కులుకు మల్లె రెమ్మకీ కుదురైన బొమ్మకీ కులుకు మల్లె రెమ్మకీ నుదుట ముద్దు పెట్టనా. ఆ.ఆ.బొట్టుగ వద్దంటే ఒట్టుగ అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ అడుగు మాడుగులొత్తనా.ఆ.ఆ... మెత్తగా... అవునంటే తప్పుగ. అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణముత్యమా... ఆ... ఆ. పొగడలేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ పొగడలేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ పొగడ దండలల్లుకొనా .ఆ.ఆ. పూజ గా పులకింతల పూజ గా తొలిజన్మల నోముకీ దొర నవ్వుల సామికీ తొలిజన్మల నోముకీ దొర నవ్వుల సామికీ చెలి మై నేనుండి పోనా. ఆ... ఆ... చల్లగా... మరుమల్లెలు చల్ల గా. అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటిముత్యమా జాబిలి చలువో.ఊ. ఊ. ఇది వెన్నెల కొలువో. ఊ. ఊ. స్వాతివాన లేత ఎండలో.ఓ.ఓ. జాజి మల్లీ. పూల గుండెలో.ఓ. ఓ. అలివేణి ఆణిముత్యమా అలివేణి .ఈ. ఈ. ఆణి.ముత్యమా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి